మోడీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు

త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడ నుండి పోటీచేయనున్నారనే చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది. మోడీ గత ఎన్నికలలో సొంత రాష్ట్రమైన గుజరాత్ వడోదరా, పవిత్ర నగరం వారణాసి నుండి పోటీచేసి రెండు చోట్ల గెలిచారు. అయితే వడోదరను వదులుకొని.. వారణాసిని అట్టిపెట్టుకున్నారు. ఇక ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఎక్కడ నుండి పోటీ చేస్తారు? ఒక స్థానం నుండే పోటీ చేస్తారా? లేక అప్పటిలానే రెండు చోట్ల పోటీచేస్తారా? అనేది అటు పార్టీలోని, ఇటు రాజకీయవర్గాలలో తీవ్రంగా చర్చ జరుగుతుంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయం తర్వాత బీజేపీ పశ్చిమ బెంగాళ్, ఒడిశా రాష్ట్రాలపై దృష్టిపెట్టి నష్టాన్ని భర్తీ చేసుకోవాలని చూస్తుంది. ఈ క్రమంలో మోడీ ఒడిశాలోని పూరీ నుండి పోటీచేస్తే పార్టీకి బలోపేతం అవుతుందని ప్రచారం జరుగుతుంది. తాజాగా మోడీ ఇచ్చిన ఒక మీడియా ఇంటర్వ్యూలో కూడా ఈ ప్రశ్నకు సూటి సమాధానం ఇవ్వలేదు. పూరీ నుండి పోటీచేసే అంశాన్ని కొట్టిపారేయలేదు. అయితే వారణాసి, పూరీ రెండు చోట్ల పోటీచేసే అంశంపై సమీక్షలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది.

Latest Updates