ఏపీలో 3 కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు ప్రారంభించిన మోడీ

 గుంటూరు పర్యటనలో ప్రధాని మోడీ.. మూడు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులను ప్రారంభించారు. విశాఖలో 11వందల78 కోట్లతో నిర్మించిన  వ్యూహాత్మక చమురు నిల్వ కేంద్రాన్ని జాతికి అంకితం చేశారు. కృష్ణపట్నం పోర్టు దగ్గర రూ.7వందల కోట్లతో నిర్మిస్తున్న బీపీసీఎల్ కోస్టల్ టర్మినల్ కు శంకుస్థాపన చేశారు ప్రధాని. అమలాపురం వద్ద ONGC వశిష్ట, ఎస్1 ఆన్ షోర్  ప్రాజెక్టును రిమోట్  ద్వారా లాంచ్ చేశారు. అభివృద్ధి పనులు చేయనివారు…తనను విమర్శిస్తున్నారని ఫైర్ అయ్యారు ప్రధాని మోడీ.

వ్యూహాత్మక చమురు నిల్వ కేంద్రం

విశాఖపట్నం వ్యూహాత్మక చమురు నిల్వ కేంద్రం నిల్వ సామర్థ్యం 1.33 మిలియన్  మెట్రిక్ టన్నులు. 11వందల78 కోట్లతో ..తీర ప్రాంతాల్లో మూడుచోట్ల ముడిచమురు నిల్వ కేంద్రాల్ని ఏర్పాటు చేస్తున్నారు. ISPRL, OIDB,  కేంద్ర ఇంధన, సహజ వాయువులు, ఇంజినీరింగ్  మంత్రిత్వశాఖలు సంయుక్తంగా ఈ ప్రాజెక్టుని చేపట్టాయి. ఈ చమురు నిల్వ కేంద్రం నుంచి దేశంలోని వివిధ ప్రాంతాల్లోని రిఫైనరీలకు పైపులైన్లు, నౌకల్లో సరఫరా అయ్యేలా ఏర్పాట్లు చేశారు.

బీపీసీఎల్ కోస్టల్ టెర్మినల్ కు శంకుస్థాపన

పెట్రో కోస్టల్  టెర్మినల్  ను కృష్ణపట్నంలో వంద ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నారు. దీని అంచనా వ్యయం 7వందల కోట్లు. దేశంలోని మూడో అతిపెద్ద చమురు కంపెనీల్లో ఒకటైన భారత్  పెట్రోలియం కార్పొరేషన్  సంస్థ ..కృష్ణపట్నంలో చమురు సమీకరణ, నిల్వ, పంపిణీల కోసం ప్రత్యేక టెర్మినల్ ను ఏర్పాటు చేస్తోంది. ప్రత్యేకించి మోటార్  స్పిరిట్ , ఇథనాల్ , హైస్పీడ్  డీజిల్ , బయో డీజిల్ ను ఇక్కడి నుంచే వివిధ ప్రాంతాలకు సప్లై చేస్తారు.

గ్యాస్ ఫీల్డ్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు

గ్యాస్  ఫీల్డ్  డెవలప్ మెంట్  ప్రాజెక్టు… కేజీ బేసిన్  అంచనా వ్యయం రూ.5వేల 3వందల కోట్లు . కేజీ బేసిన్ లోని ONGC  నిర్వహిస్తున్న వశిష్ట ఎస్ 1 బావి నుంచి చమురుని వెలికితీసే ఆఫ్ షోర్  డెవలప్ మెంట్  ప్రాజెక్టు సిద్ధమైంది. అమలాపురం సమీపంలోని తీరప్రాంతంలో ఏర్పాటైన బావుల నుంచి చమురు వెలికి తీయనున్నారు. తొమ్మిదేళ్లలో 9.56బిలియన్  క్యూబిక్  మీటర్ల చమురును ఇక్కడ ఉత్పత్తి చేయొచ్చని అంచనా వేస్తున్నారు.

Latest Updates