బోర్డింగ్ పాస్ లపై  మోడీ

ఇదేంటో తెలుసా.. ఎయిరిండియా విమానం బోర్డింగ్ పాస్ . ప్రధాని నరేంద్ర మోడీ, గుజరాత్ సీఎం విజయ్ రూపానీల ఫొటోలున్నాయి చూశారా? ఏం లేదూ.. ఇప్పుడు ఎన్ని కల కోడ్ అమల్లో ఉంది కదా.. అయినా కూడా బోర్డింగ్ పాసులపై ఎయిరిండియా ఇలావారి ఫొటోలను వేయడమే ఇప్పుడు విమర్శలకు దారి తీసింది. పంజాబ్ మాజీ డీజీపీ శశికాంత్ ఈ ఫొటోను ట్వీట్ చేశారు. ‘‘మార్చి 25న ఢిల్లీ ఎయిర్ పోర్టులో నా బోర్డింగ్ పాస్ ఇది. దానిపై నరేంద్ర మోడీ, వైబ్రంట్ గుజరాత్, విజయ్ రూపానీల ఫొటోలున్నాయి. వాటి కింద బోర్డింగ్ కు సంబంధించిన వివరాలున్నాయి. ఏం చూడని, వినని, మాట్లాడని ఇలాంటిఎన్ని కల సంఘం కోసం మనం ఎందుకో ఇన్ని డబ్బులను వేస్ట్​ చేస్తున్నాం ” అని ఆయన ట్వీట్ చేశారు. అది కాస్తా వైరల్ కావడంతో ఆ బోర్డింగ్ పాసులను వెనక్కు తీసుకుంటున్నట్టు ఎయిరిండియా ప్రకటించింది. ఎన్నికల కోడ్ ను ఉల్లం ఘించడమే అయితే, మోడీ, రూపానీ ఫొటోలను వెంటనే తొలగిస్తామని సంస్థ ప్రతినిధి ధనంజయ్ కుమార్ తెలిపారు. జనవరిలో జరిగిన వైబ్రం ట్ గుజరాత్ సదస్సు సందర్భంగా ముద్రించిన బోర్డింగ్ పాసులు అయి ఉంటాయని ఆయన చెప్పారు. ఆ ఫొటోలూ థర్డ్​ పార్టీ ప్రకటనలు అని చెప్పారు. ఒక్క గుజరాత్ లోనే కాకుం డా ఇండియా మొత్తం వాటిని వాడినట్టు చెప్పారు.

Latest Updates