ఏప్రిల్ 1న LB స్టేడియంలో మోడీ సభ

  • ఎల్బీ స్టేడియంలో మోడీ సభకోసం భారీగా జనసమీకరణ
  • ఏర్పాట్లు పరిశీలించిన బీజేపీ నేతలు

ఏప్రిల్ 1న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే బీజేపీ లోక్ సభ ఎన్నికల ప్రచార సభలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాల్గొనబోతున్నారు. బహిరంగ సభ ఏర్పాట్లను కేంద్ర మాజీ మంత్రి- సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ, సికింద్రాబాద్ లోక్ సభ అభ్యర్తి కిషన్ రెడ్డి పరిశీలించారు.

పాలమూరులో మోడీ సభ విజయవంతమయ్యిందన్న బండారు దత్తాత్రేయ.. ఏప్రిల్ 1న ఎల్బీ స్టేడియంలో పీఎం సభకు పెద్దసంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు తరలిరావాలన్నారు. గుజరాతీలు, రాజస్థానీలు, ఒడిస్సీలు వాళ్ళ సంప్రదాయ దుస్తుల్లో మోడీ సభకు హాజరవుతారని చెప్పారు. “స్టేడియంలో టీఆర్ఎస్ దుకాణం మూసేసారు…. మా దుకాణం తెరుస్తున్నాం. తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే. కాంగ్రెస్ రోజురోజుకు బలహీనపడుతోంది. కేసీఆర్ మాటల ముఖ్యమంత్రిగా మిగిలారు. మోడీ తెలంగాణకు పుష్కలమైన నిధులు ఇచ్చారు. మోడీ సభలో మరికొంతమంది ప్రముఖులు బీజేపీలో చేరతారు” అని చెప్పారు దత్తన్న.

సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల, మాల్కాజ్ గిరి లోక్ సభ పరిధిలోని బీజేపీ అభ్యర్థులు, కార్యకర్తలు ఈ సభకు వస్తారని కిషన్ రెడ్డి చెప్పారు. ఈ సభ తర్వాత తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ మరింత పెరుగుతుందని అన్నారు.

Latest Updates