సౌత్ నుంచి సై:  పోటీ యోచనలో మోడీ, రాహుల్

ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, కాంగ్రెస్ పార్టీ చీఫ్​ రాహుల్​గాంధీ తమకు పట్టున్న నార్త్​తోపాటు సౌత్ లోనూ పోటీకి సన్నద్ధమవుతున్నారు. తమ రాష్ట్రాల్లో పోటీ చేయాలని వారికి కొన్నాళ్లుగా దక్షిణాది నేతలు విజ్ఞప్తులు చేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా బీజేపీ, కాంగ్రెస్ కూడా ఏర్పాట్లు చేస్తున్నాయి. అటు తన సిట్టింగ్ స్థానమైన నార్త్​లోని అమేథీతో పాటు ఇటు సౌత్ లోని కేరళ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో నిఏదో ఒక స్థానం నుంచి రాహుల్​ బరిలోకి దిగే అవకాశం ఉంది. మోడీ కూడా అటు తన సిట్టింగ్ స్థానమైన ఉత్తరాదిలోని వారణాసితో పాటు ఇటు దక్షిణాదిలోని కర్నాటక నుంచి, లేదంటే కేరళ నుం చి పోటీ చేసే చాన్స్ కనిపిస్తున్నది.

మోడీ బరిలోకి దిగితే..
ఉత్తరాదికే పరిమితమన్న అపవాదుపోతుందన్నది బీజేపీ భావన. కర్నాటకలో కనీసం 22 సీట్లనుగెలుచుకోవచ్చని వ్యూహం. దీంతోపాటు దక్షిణాదిలో మెరుగైన ఫలితాలువస్తాయని ఆశాభావం.

రాహుల్​ బరిలోకి దిగితే..
దక్షిణాదిలో పార్టీకి అనుకూలంగావీస్తున్న గాలిని అందిపుచ్చుకోవచ్చని కాంగ్రెస్ యోచన. కేరళ వంటి రాష్ట్రాల్లో18 సీట్లు రాబట్టు కోవచ్చని, ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో నూపట్టుని లుపుకోవచ్చని నమ్మకం.

2014 లోక్‌ సభ ఎన్నికల్లో నరేంద్రమోడీ తనసొంత రాష్ట్రం గుజరాత్ లోని వడోదర నుంచి ,ఉత్తరప్రదేశ్ లోని వారణాసి నుంచి పోటీ చేశారు.రెండు చోట్ల ఆయన విజయం సాధించారు. దీంతో వడోదర సెగ్మెంట్‌‌కు రాజీనామా చేసి వారణాసి సీటును మాత్రమే తన వద్ద ఉంచుకున్నారు. ఈసారి ఎన్నికల్లో ఆయన వడోదర నుంచి పోటీ చేయడంలేదని తేలిపోయింది. ఆ స్థానానికి సంబిత్ పాత్రను అభ్యర్థిగా బీజేపీ ఖరారు చేసింది. వారణాసి నుంచి మోడీ పోటీ చేస్తారని ఇటీవల బీజేపీ తన లిస్టులోప్రకటించింది. అయితే.. వారణాసితో పాటు మరోస్థానంలోనూ మోడీ బరిలోకి దిగుతారని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో తమ వద్దనుంచి పోటీలో దింపాలని దక్షిణాది రాష్ట్రాలైన కర్నాటక, కేరళ బీజేపీ నేతలు తమ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా కర్నాటక నేతలు ఆయనపై ఒత్తిడి తెస్తున్నారు. దక్షిణాది నుంచి మోడీ పోటీ చేస్తే పార్టీపై ఉన్న ‘ఉత్తరాది’ అనే అపవాదు పోతుందని,మంచి ఫలితాలు వస్తాయని విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం పార్టీ బలంగా ఉన్న కర్నాటక నుంచి మోడీని బరిలోకి దింపాలని బీజేపీ అధిష్టానం యోచిస్తోంది. ఇందుకోసం ఆ రాష్ట్రంలోని కొన్ని సీట్లకు అభ్యర్థులను ప్రకటించకుండా పెండింగ్ లో పెట్టింది. అందులో ప్రధానంగా బెంగళూరు సౌత్ నియోజకవర్గం ఒకటి.

బెంగళూరు సౌతే ఎందుకు?
కర్నాటక రాజధాని బెంగళూరులో ఐటీ సంస్థలు,విద్యా సంస్థలు ఎక్కువగా ఉన్న ప్రాంతం బెంగళూరు సౌత్ నియోజకవర్గం . ఇక్కడ బీజేపీకి మంచి పట్టుంది.ఈ స్థానంలో 1996 నుంచి వరుసగా ఆ పార్టీ నేత అనంతకుమార్​ ఆరుసార్లు ఎంపీగా గెలిచారు. మోడీ కేబినెట్ లో కేంద్ర మంత్రిగా కూడా ఆయన కొనసాగారు. ఇటీవల అనారోగ్యంతో అనంతకుమార్​ చనిపోయారు. దీంతో ఈ ఎన్నికల్లో అనంతకుమార్​ భార్య తేజస్విని బరిలోకి దింపాలని మొదట రాష్ట్ర నాయకత్వం భావించింది. ఇందుకు అనుగుణంగా అధిష్ఠానానికి ప్రతిపాదనలు కూడా పంపింది. మొత్తం 28సీట్లున్న కర్నాటకలో ఇటీవల 21 సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు. కానీ , బెంగళూరు సౌత్ తో పాటు మరోఆరు సీట్లను పెండింగ్ లో పెట్టారు. రెండో, మూడోదశలో రాష్ట్రంలో ఎన్నికలు జరుగనున్నాయి . రెండోదశలో అంటే ఏప్రిల్ 18న బెంగళూరు సౌత్ లో పోలింగ్ జరుగనుంది. ఇక్కడ నామినేషన్లకు మంగళవారం చివరి రోజు. ఆలోగా ఏ క్షణమైనా ప్రధాని మోడీని అభ్యర్థిగా బీజేపీ ప్రకటించే అవకాశం ఉందని స్థానిక బీజేపీ నేతలు బలంగా నమ్ముతున్నారు. ఐటీ ఉద్యోగులు,విద్యార్థులు మోడీకి బలమైన ఓటు బ్యాంకు అని, ఇక్కడ ఆయా వర్గాలవారు బెంగళూరు సౌత్ లోఎక్కు వగా ఉన్నందున మోడీ గెలుపు సునాయాసమేనని, భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని ఇక్కడినేతలు చెప్తున్నారు. పైగా ప్రధాని మోడీ పోటీ చేస్తే..రాష్ట్రంలో కనీసం 22 సీట్లను గెలుచుకోవచ్చని భావిస్తున్నారు. దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలపైనా ఆ ప్రభావం ఉంటుందని, మెరుగైన ఫలితాలు రాబట్టుకోవచ్చని అంటున్నారు. బెంగళూరు సౌత్ నుంచి కాంగ్రెస్ తన అభ్యర్థిగా బీకే హరిప్రసాద్​ను ప్రకటించింది. ఈస్థానం నుంచి కాకపోతే కేరళ రాష్ట్రంలోని ఏదైనా ఓ నియోజకవర్గం నుంచి మోడీ బరిలోకి దిగే అవకాశాలూ లేకపోలేదని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి . శబరిమల ఇష్యూ వల్ల కేరళలో పార్టీ బలపడిందని, కాంగ్రెస్ కు చెక్​ పెట్టాలంటే మోడీ కేరళలో పోటీ చేయాల్సిందేనని ఆ రాష్ట్ర నేతలు పట్టుబడుతున్నారు.

అటు నార్త్​లోని వారణాసి నుంచి ఇటు సౌత్ లోని బెంగళూరు సౌత్ , లేదా కేరళలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి మోడీ పోటీ చేయడం ఖాయమని వార్తలు వస్తున్నాయి . రెండు సీట్లలో బరిలోకి దిగే మోడీ.. రెండింట్ లో గెలిస్తే మాత్రం వారణాసి నియోజక వర్గానికి రాజీనామా చేసి దక్షిణాది స్థానం నుంచే ప్రాతినిధ్యం వహిస్తారని దక్షిణాది బీజేపీ నేతలు భావిస్తున్నారు. దాని వల్ల సౌత్ లో బీజేపీ విస్తరించడానికి వీలుంటుందని, పార్టీ అగ్రనాయకత్వం కూడా ఇదే కోరుకుంటున్నదని చెప్తున్నారు.అయితే.. మరో వాదన కూడా వినిపిస్తున్నది. మోడీ రెండు చోట్ల గెలిచిన తర్వాత బెంగళూరు సౌత్ స్థానానికి రాజీనామా చేస్తారని, ఉప ఎన్నికల్లో అనంతకుమార్ భార్య తేజస్వికి టికెట్ ఇచ్చి గెలిపిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం దక్షిణాదిలో బీజేపీకి జోష్ తెచ్చేందుకు మాత్రమే ఆయన బరిలోకి దిగే అవకాశం ఉందని సమాచారం. అయితే.. ఉత్తరప్రదేశ్ లో ఎస్పీ, బీఎస్పీ కూటమి వల్ల అక్కడి అధికారబీజేపీపై వ్యతిరేకత వ్యక్తమవుతోందని, మోడీ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి కూడా అదేరాష్ట్రంలో ఉండటంతో ఆయన గెలుపుపై ప్రభావం పడే అవకాశం ఉందని విపక్షాలు అంటున్నాయి .అందుకే ఆయన దక్షిణాదిలో మరో స్థానాన్ని ఎంచుకోవాలని చూస్తున్నారని విమర్శిస్తున్నాయి .

Latest Updates