హాట్ కేక్ గా అమ్ముడవుతున్న మోడీ రాఖీలు

దేశవ్యాప్తంగా రాఖీ సందడి నెలకొంది. రాఖీల కొనుగోళ్లతో షాపులు రద్దీగా మారాయి. మార్కెట్ లో ఈసారి ప్రధాని మోడీ  రాఖీలు స్పెషల్ అట్రాక్షన్ గా మారాయి. మోడీ ఫోటోలతో ఉన్న వివిధ రకాల డిజైన్లలోని రాఖీలు కొనేందుకు మహిళలు ఆసక్తి చూపుతున్నారు. దీంతో వ్యాపారులు మోడీ రాఖీలను ఎక్కువగా విక్రయిస్తున్నారు. అమిత్ షా, కశ్మీర్ రాఖీలు కూడా జోరుగా అమ్ముడుపోతున్నాయి. ఆర్టికల్ 370ను రద్దు చేసి ప్రధాని మోడీ హీరోగా నిలిచారంటున్నారు ప్రజలు. ఈసారి మోడీ రాఖీలే స్పెషల్ గా నిలుస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.

Latest Updates