ప్రత్యేక మర్యాదలు అవసరం లేదు : మోడీ

రష్యా టూర్ లో అధికారులతో…. ప్రధాని మోడీ తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. టూర్ లో భాగంగా రష్యా ప్రతినిధులతో జరిగిన ఓ ఫోటో సెషన్ కు హాజరయ్యారు ప్రధాని. ఈ సందర్భంగా అధికారులు… అందరికి మాములు చైర్స్ వేసి…. నరేంద్ర మోడీకి ప్రత్యేకంగా సోఫాను ఏర్పాటు చేశారు. అయితే సోఫాలో కూర్చోవటానికి అంగీకరించలేదు మోడీ.

ప్రత్యేక మర్యాదలు అవసరం లేదని తెలిపారు. అంతే కాదు వారితో పాటు కుర్చీలోనే కూర్చొని ఫోటో సెషన్ లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దీంతో మోడీ తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Latest Updates