రిషి కపూర్ టాలెంట్ పవర్ హౌజ్: ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: బాలీవుడ్ సీనియర్ యాక్టర్ రిషి కపూర్ (67) మృతిపై ప్రధాని నరేంద్ర మోడీ, వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రిషి కపూర్ ను బహుముఖ, మనోహరమైన, ఉల్లాసవంతుడిగా మోడీ పేర్కొన్నారు. రిషి టాలెంట్ కు పవర్ హౌజ్ లాంటి వారని మెచ్చుకున్నారు. తమ ఇద్దరి మధ్య జరిగిన ఇంటరాక్షన్స్ ను సోషల్ మీడియాలో ఎప్పుడూ గుర్తు చేసుకుంటానన్నారు. సినిమాలతో పాటు ఇండియా పురోగతి గురించి రిషికి ఎక్కువ మక్కువ ఉండేదని తెలిపారు. ‘ఆయన మరణం నన్ను బాధపెట్టింది. రిషి ఆత్మకు శాంతి కలగాలి. ఆయన కుటుంబీకులకు, ఫ్యాన్స్ కు సంతాపం తెలియజేస్తున్నా. ఓం శాంతి’ అని మోడీ ట్వీట్ చేశారు. రిషి మరణంతో దేశం ప్రియమైన బిడ్డను, సినీ పరిశ్రమ ఒక రత్నాన్ని కోల్పోయిందని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు బాధను వ్యక్తం చేశారు.

Latest Updates