ఇయ్యాల్టి నుంచి మోడీ సేవా ఉత్సవాలు

ఈ నెల 17తో ప్రధాని మోడీకి 70 ఏళ్లు

హైదరాబాద్‌‌, వెలుగు: ప్రధాని మోడీ బర్త్‌‌డే సందర్భంగా సోమవారం నుంచి ఈ నెల 25 వరకు సేవా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని బీజేపీ రాష్ట్ర శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మోడీకి ఈ నెల 17తో 70 ఏళ్లు నిండుతున్న సందర్భంగా అన్ని మండల, డివిజన్‌‌, జిల్లా కేంద్రాల్లోనూ ఉత్సవాలు జరుపుతామని వెల్లడిం చింది. 17న రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛభారత్‌‌, 20, 21 తేదీల్లో రక్తదాన శిబిరాలు, 23న సింగిల్ యూజ్  ప్లాస్టిక్‌‌ను ఉపయోగించొద్దని అవేర్ నెస్ ప్రోగ్రాం చేస్తామని చెప్పింది.

17న వర్చువల్ సభ 

సెప్టెంబర్‌‌ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌‌ చేస్తూ 15న కాగడాల ప్రదర్శన, 17న అన్ని పోలింగ్‌‌ బూత్‌‌లలో జాతీయ జెండా ఎగురవేస్తామని, అదే రోజు సాయంత్రం 4 గంటలకు వర్చువల్‌‌ బహిరంగ సభ నిర్వహిస్తామని పేర్కొంది.

 

 

Latest Updates