మరోసారి ప్రధానిగా మోడీ: ప్రశాంత్ కిశోర్

మోడీ మరోసారి ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు ‘జేడీయూ’ వైస్ ప్రెసిడెంట్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్. 2019 లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని తెలిపారు. దేశంలో అత్యంత ప్రజాధరణ కలిగిన నేత మోడీ అని అన్నారు. ఎన్డీఏ లో నితీష్ కుమార్ ముఖ్య నేత అయినప్పటికీ ప్రధాని అభ్యర్తి.. మోడీ అని తెలిపారు. బీజేపీ స్వంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోవచ్చని అభిప్రాయపడ్డారు.

15 ఏళ్లుగా నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ… ప్రధాన మంత్రి అభ్యర్తిగా నితీష్ ను ఊహించలేం అని అన్నారు ప్రశాంత్ కిషోర్. రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధించడం తథ్యమని చెప్పారు. మహారాష్ట్రలో శివసేనను స్నేహ పూర్వకంగా కలిశానని చెప్పారు. ఒక పార్టీకి ఉపాధ్యక్ష పదవిలో ఉంటూ మరో పార్టీకి వ్యూహకర్తగా ఉండలేనని చెప్పారు. 2014 లో మోడీకి ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ పనిచేశారు. ఆతర్వాత వైఎస్ ఆర్ సీపీకి, జేడీయూకి అతను పనిచేశారు.

Latest Updates