ఆ ఇద్దరికి మోడీ పాదాభివందనం.. వాళ్లెవరంటే..?

ఉత్తర్ ప్రదేశ్ లోని వారణాసి నియోజకవర్గం నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇవాళ నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన ఇద్దరికి పాదాభివందనం చేశారు. మోడీ చేసిన ఈ చర్య… సోషల్ మీడియాలో జేజేలు అందుకుంటోంది.

నామినేషన్ కు వెళ్లకముందు… ప్రధానమంత్రి నరేంద్రమోడీ… అకాలీదళ్ సీనియర్ నాయకుడు ప్రకాశ్ సింగ్ బాదల్ కాళ్లు మొక్కారు. 93 ఏళ్ల బాదల్… మోడీని ఆశీర్వచనాలు ఇచ్చి అభినందించారు. మోడీ తన హోదాను పక్కనపెట్టి… ఎన్డీయే మిత్రపక్ష నాయకుల సమక్షంలో …. వయసులో ఎంతో పెద్దవాడైన బాదల్ ఆశీస్సులు తీసుకోవడం గొప్ప విషయమని నెటిజన్లు అన్నారు.

ఆ తర్వాత నామినేషన్ ను ప్రపోజ్ చేసిన 92 ఏళ్ల అన్నపూర్ణ శుక్లా పాదాలకు అభివాదం చేశారు ప్రధానమంత్రి.

నామినేషన్ పేపర్లలో నాలుగు వేర్వేరు ప్రాంతాలు, వర్గాలకు చెందిన నలుగురు వ్యక్తులు మోడీని ప్రపోజ్ చేశారు. జగదీశ్ చౌదరి, సోషల్ వర్కర్ సుభాష్ గుప్తా,  ప్రిన్సిపాల్ అన్నపూర్ణ శుక్లా, సైంటిస్ట్ రామ్ శంకర్ పటేల్ వారిలో ఉన్నారు.

ఉదయం 11.45 నిమిషాలకు అభిజిత్ లగ్న ముహూర్తంలో మోడీ నామినేషన్ వేశారు. నామినేషన్ రూమ్ లో దాదాపు గంట పాటు గడిపారు మోడీ. నామినేషన్ పేపర్లను డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ పరిశీలిస్తున్నంత సేపు తన కుర్చీలో కూర్చుని ఎదురుచూశారు.

Latest Updates