ఎర్త్‌డే సందర్భంగా మోడీ ట్వీట్‌

  • కరోనా వారియర్స్‌కు బాసటగా నిలుద్దాం
  •  భూమిని కాపాడుకోవాలని విజ్ఞప్తి
  • న్యూఢిల్లీ: ఇంటర్నేషనల్‌ ఎర్త్‌డే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ కరోనా వారియర్స్‌ను ప్రశంసించారు. ఈ సందర్భంగా బుధవారం ట్వీట్‌ చేశారు. భూమిని కాపాడుకోవాలని అన్నారు. “ ఇంటర్నేషనల్‌ ఎర్త్‌డే రోజున, మనందరినీ సంరక్షిస్తున్న భూమి పట్ల కృతజ్ఞత తెలియజేదాం. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన, సంపన్నమైన భూమి కోసం కృషి చేస్తామని ప్రామిస్‌ చేద్దాం. కరోనాను ఓడించేందుకు ముందంజలో ఉంది పనిచేస్తున్న వారియర్స్‌కు బాసటగా నిలుద్దాం” అని మోడీ ట్విట్టర్‌‌లో పేర్కొన్నారు. ఎర్త్‌డే సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ట్వీట్‌ చేశారు. “ గతం, కఠినమైన వర్తమానం నుంచి పాఠాలు నేర్చుకోవాలి. మరిన్ని స్థిరమైన మార్గాలు ఆవిష్కరించుకోవాలి. ఇండస్ట్రీస్‌ మూత పడటం, విమానాలు రద్దు కావడం, రోడ్లపై వాహనాలు తక్కువగా తిరగడంతో కాలుష్య బాగా తగ్గింది” అని వెంకయ్యనాయుడు అన్నారు. పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేయాడాన్ని నిరసిస్తూ 1970లో అమెరికన్లు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేసిన మొదటి రోజు (ఏప్రిల్‌ 23)ను ప్రతి ఏడాది ఇంటర్నేషనల్‌ ఎర్త్‌డేగా నిర్వహిస్తారు.

Latest Updates