విశాఖ ఘటనపై మోడీ దిగ్భ్రాంతి

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ విశాఖ నగరంలోని గోపాల్‌పట్నం దగ్గర జరిగిన గ్యాస్‌లీకేజ్‌ ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులందరూ త్వరగా కోలుకోవాలని గురువారం ట్వీట్‌ చేశారు. “ ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ అధికారులతో మాట్లాడాను. దీనిపై మానిటర్‌‌ చేస్తున్నారు. విశాఖలోని ప్రతి ఒక్కరి భద్రత, శ్రేయస్సు కోసం ప్రేయర్‌‌ చేస్తున్నాను” అని మోడీ ట్వీట్‌ చేశారు. ఈ ఘటనపై 11 గంటలకు నేషనల్‌ డిజాస్టర్‌‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీతో మోడీ భేటీ అవుతారని పీఎంవో ప్రకటించింది. విశాఖ నగరంలోని గోపాలపట్నం పరిధి ఆర్.ఆర్‌‌. వెంకటాపురంలోని ఎల్‌.జి.పాలిమర్స్‌ ఫ్యాకర్టరీ నుంచి రసాయన వాయువు లీకై దాదాపు 3.కి.మీ మేర వ్యాప్తించింది. దీంతో చాలా మంది అస్వస్థతకు గురయ్యారు. గాలి పీల్చుకున్న వారంతా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వారందరినీ విశాఖ కేజీహెచ్‌కు తరలించి ట్రీట్‌మెంట్‌ ఇస్తున్నారు.

Latest Updates