నర్మదా నదీ తీరంలో మోడీ పూజలు

ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ 69వ జన్మదినోత్సం జరుపుకుంటున్నారు. మోడీ పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా స్వచ్ఛతా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో  ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ప్రధాని మోడీ గుజరాత్ లో పర్యటిస్తున్నారు. నర్మదా జిల్లాలోని కెవదియాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.

వివిధ ప్రాజెక్టుల పురోగతిని ప్రధాని సమీక్షించారు. నర్మదా నదీ తీరంలో పూజలు చేశారు. సర్ధార్ సరోవర్ డ్యాం కంట్రోల్ రూమ్ ను సందర్శించారు మోడీ. గురుదేశ్వర్ లోని దత్తాత్రేయ మందిరాన్ని మోడీ సందర్శిస్తారు. కెవదియ వద్ద నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొంటారు.

Latest Updates