కొత్త మోడీని చూస్తామా!

modi will form government come in 2019

ప్రస్తుత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి గతంలో మాదిరిగా క్లియర్ కట్ మెజారిటీ రాదని ప్రీపోల్ సర్వేలు ఇప్పటికే చెప్పేశాయి. కమలనాథులకు 2014తో  పోల్చితే ఇప్పుడు సీట్లు తగ్గినా మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని మళ్లీ వాళ్లే  ఏర్పాటు చేసే అవకాశం ఉందని అంటున్నాయి. మరి, కేంద్రంలో సంకీర్ణ సర్కార్ అంటూ ఏర్పడితే దాన్ని మోడీ నడపగలరా అనే డౌటు వస్తోం ది. గుజరాత్ ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా ఇన్నాళ్లూ ఆయన వన్ మ్యాన్ షో చేశారు. రేపటి రోజున సంకీర్ణ ప్రభుత్వాన్ని మిత్ర పక్షాలు కంట్రోల్ చేయటానికి చూస్తే ఎలా డీల్ చేస్తారన్న ప్రశ్న తెరమీదకు వచ్చింది.

లోక్ సభలో ఎన్డీఏకి, దానికి నాయకత్వం వహిస్తున్న బీజేపీకి స్పష్టమైన ఆధిక్యత ఉండటంతో ఈ ఐదేళ్లూ పాలన నల్లేరుపై నడకలా సాగింది. కేంద్రంలో పేరుకే అలయెన్స్  ప్రభుత్వం ఉన్నా పెత్తనమంతా బీజేపీదే. ఆ పార్టీ చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్లు నడిచింది. ప్రధానిగా మోడీకి ఇది ఫస్ట్ టర్మే అయినా ప్రభుత్వంలో ఆయనకు ఎదురే లేకుం డాపోయింది. పార్టీలోనూ మోడీది తిరుగులేని డామినేషనే. మిత్రుడు అమిత్ షాతో కలిసి స్వపక్షంలో ఎలాంటి విపక్షమూ లేకుండా మెయింటెయిన్ చేశారు.గుజరాత్ ముఖ్యమంత్రిగా పుష్కర కాలానికి పైగా పనిచేసిన మోడీ గోద్రా అల్లర్ల వల్ల మొదట్లో కాస్త ఇబ్బంది పడ్డా తర్వా త పదేళ్లు తన హవా కొనసాగించారు. రాష్ట్ర అసెంబ్లీ లో కమలదళం ఎప్పుడూ ఫుల్ మెజారిటీతో కంఫర్టబుల్ జోన్ లోనే ఉండేది. దీంతో అటు గుజరాత్లో గానీ ఇటు కేంద్రంలో గానీ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపాల్సిన అవసరం, నడిపిన అనుభవం మోడీకి ఎప్పుడూ రాలేదు. కాబట్టి, కొయిలేషన్ గవర్నమెంట్ ను డీల్ చేయటం అనేది ఆయనకు పూర్తిగా కొత్త కాన్సెప్ట్ గానే భావించాలి.

నరేంద్ర దామోదర్ దాస్ మోడీ.. అటల్ బిహారీ వాజ్ పేయి కాదు. కూటమి సర్కారులో భాగస్వామి గా ఉంటూ ఎప్పుడు ఏ డిమాండ్లు పెడతారో, రాజకీయంగా ఏ క్షణంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో తెలియని జయలలిత, మమతా బెనర్జీ లాంటి నేతలను ఆయన గతంలో ఎప్పుడూ నేరుగా ఎదుర్కోలేదు. (ప్రస్తుతం మోడీకి, దీదీ కి మధ్య నడుస్తున్న రాజకీయ వైరం వేరు). అందువల్ల వాజ్ పేయి మాదిరిగా మోడీ..అలయెన్స్  ప్రభుత్వాన్ని చాకచక్యం గా, రాజనీతితో మేనేజ్ చేయగలరా అనే ప్రశ్న తలెత్తుతోంది.

దిగువ సభలో పార్టీకి సరైన సంఖ్యా బలం లేనప్పుడు ప్రభుత్వాన్ని నడపటం కష్టంతో కూడిన వ్యవహారం.కేంద్ర కేబినెట్ లో వేరే పార్టీ మంత్రులు ఉంటే వాళ్లు ముందుగా తమ ప్రయోజనాలే నెరవేరాలని ఆశిస్తారు. వాళ్లకంటూ కొన్ని సొంత అజెండాలు ఉంటాయి. వాటికి సాధ్యమైనంత త్వరగా ఆమోద ముద్ర వేయించుకోవాలని చూస్తారు. ఏమాత్రం తటపటాయించినా, ఆలస్యం చేసినా, వ్యతిరేకించినా వెంటనే రియాక్షన్ ఇస్తారు. పీఎం కుర్చీలో కూర్చున్న వ్యక్తి చెప్పి న ప్రతిదానికీ తలూపాలనుకోరు.

అలాంటి సందర్భాల్లో ప్రభుత్వ పెద్దగా ప్రధాని మోడీ రామబాణంలా దూసుకుపోలేరు. ఒక్కోసారి వ్యూహాత్మకంగా వెనకడుగు వేయాల్సి వస్తుంది. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుం ది. ప్రభుత్వ పరిపాలన వన్ మ్యా న్ ఆర్మీలా, ఈజీగా సాగకపోవచ్చు.ఫలితంగా జాతీయ రాజకీయాల్లో బలమైన నేతగాముద్రపడిన మోడీ ఇమేజ్ కు కొంత డ్యా మేజ్ జరగొచ్చు. అయితే, దాన్ని సానుకూలంగా  స్వీకరించే సహనం, ఓర్పు ఆయనలో ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

భారీ విజయాల తర్వాత ఓటములు

ఓటర్లు రాజకీయ విశ్లేషకుల అంచనాలను తలకిందులు చేసిన ఎన్ని కలు గతంలో ఎన్నో ఉన్నా యి. ఈ లెక్కన ఇప్పుడు జరుగుతున్న జనరల్ ఎలక్షన్ లో బీజేపీకి, ఎన్డీయేకి సర్వేలు చెప్పినన్ని సీ ట్లు కూడా రాకపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. భారీ విజయాలు సాధించిన పార్టీలు తర్వాతి ఎన్నికల్లో గెలిచిన దాని కన్నా ఓడిన సందర్భాలే ఎక్కువ. ఫుల్ మెజారిటీతోగెలిచి ఐదేళ్లు ప్రభుత్వాన్ని సక్సెస్ ఫుల్ గా నడిపిన అధికార పార్టీలు తర్వా త జరిగిన ఎలక్షన్స్ లో ఘోరంగా చి త్తయిన ఉదాహరణలు చాలా ఉన్నా యి.1971లో ఇందిరాగాంధీ, 1984లో రాజీవ్ గాంధీ దీనికి గుడ్ ఎగ్జాంపుల్స్ . 1977లో కాం గ్రెస్ ను ఓడించి పవర్ లోకి వచ్చిన జనతా పార్టీ కూడా ఇంతే.ఆ తర్వా త జరిగిన ఎన్నికల్లో విజయం సాధించలేక చతికిలపడింది. ఐదేళ్ల కిందట బీజేపీ, ఎన్డీయే ఎవరూ ఊహిం చని రీతిలో బంపర్ మెజారిటీతో విక్టరీని నమోదు చేశాయి. గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాం గ్రెస్ కి చరిత్రలో ఎప్పుడూ లే ని రీతిలో లోక్ సభలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేశాయి. కాబట్టి ఇప్పుడు కమలనాథులు కూడా ఇలాగే బొక్కబోర్లా  పడొచ్చేమోననే ఊహాగానాలు వినిపిస్తున్నా యి.

సర్వేలు ఏం చెబుతున్నాయి..

జనరల్ ఎలక్షన్ కి ముందు సీఎస్ డీఎస్ –లోక్ నీతి సర్వేలో బీజేపీ ఓటు షేరు నాలుగు శాతం పెరగొచ్చని తేలినా ఆ పార్టీకి 222–232 సీట్లే వస్తాయని అంచనా. ఎన్డీఏ బలం 263–283 వద్దే ఉండొచ్చట. సీ ఓటర్స్ సర్వే ప్రకారం కూడా ఎన్డీఏ గెలిచే స్థా నాల సంఖ్య 233 మాత్రమే. గత సార్వత్రిక ఎన్నికల్లో కమలనాథులు సొంతంగానే 283 సీట్లు సాధించారు. ఆ పార్టీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ఏకంగా 336 స్థా నాల్లో విజయం సా ధించింది. లోక్ సభలో మొత్తం సీట్లు 543 కాగా కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మినిమం ఎంపీల సంఖ్య 272.

ప్రస్తుతం బీజేపీకి ప్రభుత్వ వ్యతిరేకత ప్రతికూలంగా మారుతుంది. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీతో లక్షల సంఖ్యలో జాబులు పోవటం, ఎన్డీయేలోని కొన్ని మిత్ర పక్షాలు జారుకోవటం మైనస్ పాయింట్లే . ఈ ట్రెండ్ కి అద్దం పట్టేలా ఇటీవల కొన్ని రాష్ట్రాలు బీజేపీ చేజారాయి. గతేడాది చివరలో గుజరాత్ లో చావుతప్పి కన్ను లొట్టబోయింది. వివిధ రాష్ట్రాల్లో హస్తం పార్టీ పుంజుకుంది. నంబర్ గేమ్ లో వెనకబడితే తెలుగు రాష్ట్రాల్లో ని టీఆర్ఎస్ , వైఎస్ ఆర్ సీపీ సపోర్ట్ చేస్తాయా లేదా అనేదీ డౌటే. ఈ నేపథ్యంలో సంకీర్ణప్రభుత్వం ఏర్పడితే కొత్త మోడీని చూస్తామా ?.             – ‘ది వైర్ ’ సౌజన్యంతో..

Latest Updates