రాహుల్ కు మోడీ పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఇవాళ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ బర్త్ డే సందర్భంగా ప్రధాని మోడీ.. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరారు. దీనికి సంబంధించి మోడీ ట్విట్టర్‌ ట్వీట్ చేశారు.

రాహుల్‌ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ కూడా ఆయనకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా గతంలో ఆయన దేశ ప్రజలను ఉత్తేజపరుస్తూ చేసిన ఐదు ప్రసంగాలను ట్విట్టర్  వేదికగా పంచుకుంది. అలాగే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రాహుల్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Latest Updates