మోడీ హెలికాప్టర్ అంత సీక్రెటా ?

 

  • ప్రధాని చాపర్ ను తనిఖీ చేసిన అధికారిపై ఈసీ వేటును తప్పు పట్టిన ప్రతిపక్షాలు

ప్రధాని నరేంద్ర మోడీ హెలికాప్టర్ ను తనిఖీ చేసిన ఐఏఎస్ అధికారిని ఎన్నికల సంఘం సస్పెండ్​ చేయడాన్ని ప్రతిపక్షాలు తప్పుబట్టాయి. ఎన్నికల ప్రచారంలో వాడే అన్ని వాహనాలను తనిఖీ చేయొచ్చని నిబంధనల్లో స్పష్టం గా ఉందని, తనిఖీ చేసిన అధికారిని సస్పెండ్​ చేయడం ద్వారా ఈసీ తన నిబంధనల్ని తానే అతిక్రమించిందని కాంగ్రెస్ , ఆమ్ ఆద్మీ పార్టీలు ఆరోపించాయి. ప్రజల కళ్లుగప్పి ప్రధాని తన హెలికాప్టర్ లో అంత రహస్యం గా తరలిస్తున్నదేంటి అని కాంగ్రెస్ ప్రశ్నించింది. ఆ రహస్యమేంటో బయటకు తెలియాల్సిందేనని డిమాండ్​ చేసింది. ప్రజలకు తెలియకుండా ఉండాలనుకుంటున్న ఆ రహస్యమేంటని ప్రశ్నించింది. చౌకీ దార్ దేన్నో దాచిపెడుతున్నారంటూ ఆప్ సెటైర్లు వేసింది. మోడీ తన చుట్టూ ఏర్పాటు చేసుకున్నరక్షణ వలయంలోనే ఉంటారని ట్వీట్ చేసింది. కాగా, కర్నాటక సీఎం కుమారస్వామి హెలికాప్టర్ లో ఈసీ అధికారులు మళ్లీ సోదాలు చేశా రు. మంగళ, బుధవారాల్లో తనిఖీలు చేసి న ఈసీ.. గురువారమూ ఆయన ఉత్తర కన్నడ జిల్లా లో ల్యాండైన మరుక్షణమే చుట్టు ముట్టేసి సోదాలు చేసింది. తన పట్ల ఈసీ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని కుమారస్వామి ఆరోపించారు.

అసలేమైంది?

కొద్దిరోజుల కిందట ప్రధాని మోడీ కర్నాటకలోని చిత్రదుర్గలో ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లో​ పెద్ద ట్రంకు పెట్టెను తరలించారు. ఇద్దరు వ్యక్తులు హెలీప్యాడ్​ నుంచి ఆ పెట్టెను బయటికి తీసుకెళుతున్న వీడియో వైరల్ అయింది. దానిపై కాంగ్రెస్ , ఇతర పార్టీలు ఈసీకి ఫిర్యాదు చేశాయి. ఆ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా హెలికాప్టర్ లనూ అధికారులు వదల్లేదు. సీఎంలు, కేంద్ర మంత్రులు ప్రయాణించిన చాపర్లలో ఈసీ అధికారులు సోదాలు చేశారు. ఇదే క్రమంలో మంగళవారం సంబల్ పూర్ (ఒడిశా)లో ఎన్నికల పరిశీలకుడిగా ఉన్న మహ్మద్ మోసిన్ (1996 బ్యాచ్ కర్ణాటక కేడర్ ఐఏఎస్ అధికారి) ప్రధాని మోడీ హెలికాప్టర్ ను తనిఖీ చేశారు. సోదాల కారణంగా మోడీ తిరుగు ప్రయాణం 15 నిమిషాలు ఆలస్యమైంది. దీంతో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారంటూ మోసిన్ ను ఈసీ సస్పెండ్​ చేసింది. ‘‘2014 ఏప్రిల్ 10న జారీ అయిన నిబంధనల ప్రకారం ఎస్పీజీ భద్రతలో ఉన్న వ్యక్తుల వాహనాలకు తనిఖీల నుంచి మినహాయింపు ఉంటుంది. ఈ విషయం మోసిన్ కు తెలిసినా నిబంధనలు అతిక్రమించారు. అందుకే చర్యలు తీసుకున్నాం ” అని ఈసీ పేర్కొం ది. నిజానికి ఆ నిబంధనల ప్రకారం ఎన్నికల ప్రచారానికి అధికారిక వాహనాలు వాడడం నిషిద్ధం .కానీ, ఎస్పీజీ భద్రతలో ఉండే ప్రధాన మంత్రి, ఇతర వీవీఐపీల వాహనాలకు మాత్రం మినహాయింపుంది. అదే ఎస్పీజీ భద్రత ముసుగులో వాళ్లు అక్రమాలకు పాల్పడుతున్నట్లు అనుమానం కలిగితే చర్యలు తీసుకునేలా ప్రభుత్వానికి నోటీసులివ్వాలి. అయితే, ప్రభుత్వవాహనాలకూ మినహాయింపు లేదని 1999, జూలై14న ఇచ్చిన ఉత్తర్వులు ఇంకా అమల్లోనే ఉన్నాయని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి.

Latest Updates