పండక్కి ముందే మరో స్టిములస్ ప్యాకేజీ

రోజు రోజుకూ బలహీనంగా మారుతున్న ఎకానమీని గాడిన పెట్టడానికి మోడీ సర్కారు మరోసారి స్టిములస్ ప్యాకేజీని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కరోనా లాక్ డౌన్ వల్ల లక్షల మంది జాబ్స్ కోల్పోయారు. ఎన్నో బిజినెస్ లు మూతబడ్డాయి. కొత్త జాబ్స్ కల్పించడం,అన్ని సెక్టార్లలో డిమాండ్ పెంచడమే టార్గెట్ గాఈ ప్యాకేజీ తయారవుతున్నట్టు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఇదివరకు ప్రకటించిన గరీబ్ కల్యాణ్ ప్యాకేజీ, ఆత్మనిర్భర్ ప్యాకేజీ కంటే ఈసారి స్టిములస్ ప్యాకేజీకి మరిన్నిఫండ్స్ కేటాయిస్తారు. పట్టణ ఉపాధి హామీ పథకానికి రూ.35 వేల కోట్లు ఇస్తారు. దాదాపు 25 భారీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులను ఈ ఏడాదిలోపే పూర్తి చేయడానికి డబ్బు ఇస్తారు. గ్రామీణ ఉపాధి, రైతు సంక్షేమ పథకాలకు ఫండ్స్ కేటాయింపు కొనసాగుతుంది. పేదలకు ఉచితంగా ఆహారం, డబ్బుఅందించడాన్ని కూడా ఆపివేసే అవకాశం లేదు.మరికొన్ని వారాల్లోపే ఈ ప్యాకేజీని ప్రకటించవచ్చు. వచ్చే నెల మూడో వారం తరువాత దసరా,దీపావళి పండగలు వస్తున్న సంగతి తెలిసిందే. అందుకే అక్టోబరు–డిసెంబరు క్వార్టర్ వెహికల్ ,సబ్బులు, షాంపూల వంటి కంపెనీలు, వైట్ గూడ్స్ కంపెనీలకు చాలా ముఖ్యం . ఎక్కువ మంది జనం ఇదే టైంలో షాపింగ్ చేస్తుంటారు.

ఎన్ ఆర్ ఈజీఎస్ మాదిరిగానే…..

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్ఆర్ ఈజీఏ) మాదిరే పట్టణ ఉపాధి హామీ పథకంఉండనుం ది. ఈ విషయమై సంబంధిత ఆఫీసర్లుపెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు. అర్బన్ ,సెబీ–అర్బన్ ఏరియాల్లో దీనిని అమలు చేస్తారు. ఈ స్కీమ్ ను అమలు చేయడానికి ప్రత్యేక చట్టంతేవాల్సి న అవసరం లేదని సెం ట్రల్ గవర్నమెంట్ భావిస్తోంది. ముం దుగా పెద్ద పట్టణాల్లో స్కీమ్ నుఅమలు చేశాక టైర్ –3, టైర్ –4 సిటీలకూ అందుబాటులోకి తెస్తారు. పెద్ద సంఖ్యలో జాబ్స్ కల్పిం చడానికి ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులను వేగవంతంచేస్తారు. వీలైనంత త్వరగా ఉపాధిని పెం చడానికిఈ ఏడాదే 25 పెద్ద ప్రాజెక్టులను పూర్తి చేయాలనిటార్గెట్ గా పెట్టుకున్నారు. ఇది వరకు ప్రకటించినరెం డు ప్యాకేజీల్లోనూ రూరల్ ఎకానమీని గాడినపెట్టడంపై ఫోకస్ చేయగా, ఈసారి కూడా ఇదేవిధానాన్ని కొనసాగిస్తారు. ఉచితంగా ఆహారం,డబ్బు అందజేసే కార్యక్రమాలు యథావిధిగాకొనసాగుతాయి. అయితే చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ కృష్ణమూర్తి సుబ్రమణియన్ ఈ ఏడాదిజూలైలో మీడియాతో మాట్లాడుతూ కరోనావ్యాక్సిన్ వచ్చాకే స్టిములస్ ప్యాకేజీ ప్రకటిస్తా మని అన్నారు. ఇప్పట్లో వ్యాక్సిన్ వచ్చే అవకాశంలేకపోవడం, కరోనా కేసులు పెరుగుతూనేఉండటం, జీడీపీ లెక్కలు నిరాశ కలిగిం చడంతోమూడో ప్యాకేజీ కూడా ఇవ్వాలని సెం ట్రల్ గవర్నమెంట్ భావిస్తోంది. మార్కెట్లోకి మరిం త డబ్బునుపంపిం చగలిగితేనే ఎకానమీని తిరిగి పట్టాలెక్కిం చవచ్చని అనుకుంటు న్నది. అన్నింటి కంటేఉపాధిని కల్పిం చడానికి మోడీ సర్కారు పెద్దపీట వేస్తుందని ఎకానమీ మినిస్ట్రీ వర్గాలు తెలిపాయి.ఏప్రిల్ –జూన్ క్వార్టర్ జీడీపీ 23.9 శాతం తగ్గింది.ఇండియాకు ఇండిపెండెన్స్ వచ్చాక, జీడీపీ ఇంత తక్కువగా ఉండటం ఇదే మొదటిసారి.

మరిన్ని సెక్టార్లకు పీఎల్ఐ….

మరిన్ని ఇన్వెస్ట్మెంట్లను ఆకర్షించడానికి, చైనా కంపెనీలను మన దగ్గరికి తీసుకురావడానికి కూడా కేంద్రం ప్రయత్నాలను మొదలుపెట్టింది. ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్ ,ఫార్మా, మెడిసిన్స్ సెక్టార్లకు ఇస్తున్నప్రొడక్సన్ లింక్డ్ ఇన్సెంటివ్స్(పీఎల్ఐ)ను మరిన్ని సెక్టార్లకు అందించనుంది. టెక్స్ టైల్స్ ,ఫుడ్ ప్రాసెసింగ్ , సోలార్ ప్యానెల్స్ ,ఆటోమొబైల్ కాంపోనెంట్స్ కంపెనీలకు కూడా పీఎల్ఐ స్కీమ్ ను వర్తింపజేయనుంది. ఇందుకోసం ఒక కేబినెట్ నోట్ ను కూడా తయారు చేస్తోంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను మెరుగుపర్చడానికి చట్టాల్లోమార్పులు తీసుకురానుంది. ఫార్మాకంపెనీలు చైనాపై ఆధారపడకుండా చేయడానికి ఇది వరకే 53బల్క్ డ్రగ్స్ ప్రొడక్షన్ ను పీఎల్ఐ కిందకు తీసుకుచ్చింది. దీని విలువ రూ.6,940 కోట్లు. ఫలితంగా 136 ఫార్మా కంపెనీలకు మేలు జరుగుతుంది. అదనంగా రూ.46 వేల కోట్ల విలువైన మందులు తయారవుతాయి .యాక్టివ్ ఇంగ్రీడియెంట్స్ , మెడికల్ డివైజ్ కంపెనీలకు కూడా పీఎల్ఐ స్కీమ్ ను అమలు చేస్తున్నది.

Latest Updates