మోడీ ఆడుతున్ననాటకాలు ఇక చెల్లవు: మాయావతి

ప్రధాని మోడీతో పాటు కాంగ్రెస్ పార్టీపై బహుజన్‌ సమాజ్‌ పార్టీ అధినేత్రి మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ(గురువారం) యూపీలోని కన్నౌజ్‌లో ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌తో కలిసి ఆమె ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ఎన్నికలతో నమో నామస్మరణ ముగుస్తుందన్నారు. తాను చౌకీదార్‌నంటూ మోడీ ఆడుతున్న నాటకాలు ఇకపై చెల్లవన్నారు.

గత ఎన్నికల్లో అబద్దపు హామీలతో బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు మాయావతి. ఈ ఐదేళ్లలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలనూ మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ విషయమై మాయావతి మాట్లాడుతూ… కుల రాజకీయాలు చేస్తోందన్నారు. ఆ పార్టీ అధికారంలో ఉండగా రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్‌కు భారతరత్న ఇవ్వలేదన్నారు. ఎస్పీ అధినేత అఖిలేష్ భార్య డింపుల్ యాదవ్‌ను, ఎస్పీ-బీఎస్పీ-ఆర్‌ఎల్‌డీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని మాయావతి ప్రజలను కోరారు.

Latest Updates