బద్రీనాథ్ లో మోడీ ప్రత్యేక పూజలు

modis-special-prayers-in-badrinath

ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బద్రీనాథ్‌ ఆలయాన్ని ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం సందర్శించారు. తర్వాత అక్కడ పూజలు నిర్వహించారు.  రెండు రోజుల ఉత్తరాఖండ్‌ పర్యటనలో ఉన్న ఆయన శనివారం కేదార్‌నాథ్‌ ఆలయాన్ని సందర్శించుకొని అక్కడే హియాలయాల్లోని పవిత్ర గుహల్లో దాదాపు 20 గంటల పాటు ధ్యానంలో పాల్గొన్నారు. రెండో రోజైన ఆదివారం కూడా కేదార్ నాథ్ ఆలయం  ముందు  భక్తిభావంతో  ప్రార్థన చేశారు.  కేదారేశ్వరున్ని  దర్శించుకునేందుకు వచ్చిన  భక్తులకు  అభివాదం చేశారు.  సింగపూర్,  దుబాయ్ వెళ్లే బదులు.. మనదేశంలోనే  చూసే  ప్రదేశాలు చాలా ఉన్నాయని  చెప్పారు. కేదార్ నాథ్ తో  ప్రత్యేక అనుబంధం  ఉందని,  2013  ప్రకృతి విలయం  తర్వాత  కేదార్ నాథ్  అభివృద్ధికి మాస్టర్  ప్లాన్  అమలు  చేస్తున్నామన్నారు. ఆ తర్వాత  బద్రీనాథ్ వెళ్లారు.  అక్కడి నుంచి  మధ్యాహ్నం  తర్వాత  ఢిల్లీ తిరిగి వెళ్తారు.

 

Latest Updates