వార్నర్, ఫించ్ దూకుడు..పాక్ టార్గెట్-308

టాంటన్: వరల్డ్ కప్-2019లో భాగంగా బుధవారం పాక్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 307 రన్స్ కి ఆలౌటైంది. ఆస్ట్రేలియాకు మంచి ప్రారంభం దక్కింది. ఓపెనర్లు ఆరోన్ ఫించ్(82), వార్నర్(104సెంచరీ)తో రాణించారు. ఆ తర్వాత వచ్చిన ప్లేయర్లు తక్కువ రన్స్ కే పరిమితమయ్యారు. ఓ దశలో 350కి మించిన స్కోర్ చేస్తుందనుకున్న ఆస్ట్రేలియాను కట్టడి చేశారు పాక్ బౌలర్లు. అమీర్ కట్టుదిట్టమైన బౌలింగ్ వేసి 5 వికెట్లు తీశాడు.

ఆసిస్ ప్లేయర్లలో..ఫించ్(82), వార్నర్(107), షాన్ మార్ష్(23), మాక్స్ వెల్(20), ఉస్మాన్ ఖవాజా(18) ఎక్కువ రన్స్ తో రాణించారు.

పాక్ బౌలర్లలో..ఆమిర్(5), అఫ్రీది(2), హఫీజ్(1), రియాజ్(1), హసన్ అలీ(1) వికెట్లు తీశారు.

Latest Updates