రాజేంద్ర‌నగర్ లో MIM నేత దారుణ హత్య

రంగారెడ్డి: జిల్లాలోని రాజేంద్ర‌నగర్  ఆదివారం రాత్రి దారుణ హత్య జరిగింది. స్థానిక ఎంఐఎం నేత మహమ్మద్ ఖలీల్‌ ను ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వెంబడించి చంపారు. న‌డిరోడ్డుపై అతన్ని కట్టెలు, రాళ్ల‌తో కొట్టి చంపారు. రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో పిల్లర్ నెంబర్ 260 ఎచ్‌ఎఫ్ ఫంక్షన్ హల్ ఎదురుగా ఈ దారుణం జ‌రిగింది. దీనిపై సమాచారం అందుకున్న‌ రాజేంద్రనగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. భూ వివాదాలే ఈ హత్యకు కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Latest Updates