మోడీ చెడు నుంచి మంచిని వేరు చేసే డివైడర్: ఇమామ్ మొహమ్మద్

మోడీపై కావాలనే తప్పుడు కథనాన్ని టైమ్ ప్రచురించిందని అన్నారు ఓ ముస్లిం ఇమామ్. మోడీ నా హీరో అన్నారు ఇమామ్ మొహమ్మద్ తాహీది. చెడు నుంచి మంచిని వేరు చేయడానికే మోడీ ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఆయన ఆధ్వర్యంలో అంతర్జాతీయంగా దేశం ముందుకు వెళ్తుందని తెలిపారు. మోడీకి దేవుని అండ వుంటుందని అన్నారు ఇమామ్.

మహమ్మద్ తాహితీ అనే ఈ ఇమామ్ ఇరానీ-ఆస్ట్రేలియన్. ఈయనను ముస్లిం శాంతి కర్తగా.. ఇస్లాం రిఫార్మర్ గా ఆస్ట్రేలియాలో గుర్తిస్తారు. వీరికి ఆస్ట్రేలియా వ్యాప్తంగా అన్ని మతాల వాళ్లు అభిమానులుగా ఉన్నారు. ఈయన ప్రపంచ శాంతిపై పలు పుస్తకాలను రాశారు.