పోలీసు పోస్టుల భర్తీ తెలంగాణలోనే ఎక్కువ

నేర చరిత్ర కలిగిన కానిస్టేబుల్స్ ను డిపార్ట్ మెంట్ లోకి తీసుకోబోమన్నారు..రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ. 300 మంది కానిస్టేబుల్ అభ్యర్థులపై.. పలు కేసుల్లో విచారణ కొనసాగుతుందన్నారు. హైదరాబాద్  లో కానిస్టేబుల్  శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు హోంమంత్రి. టీఆర్ఎస్  ప్రభుత్వమే అత్యధికంగా కానిస్టేబుళ్ల ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీస్ శాఖకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామన్నారు. కార్యక్రమంలో నగర పోలీస్  కమిషనర్  అంజనీకుమార్ , పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Latest Updates