నేడు సౌదీ అరేబియా యువరాజుతో మోడీ భేటీ

ఢిల్లీ : సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్.. రెండు రోజుల పర్యటన కోసం భారత్ చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆయనకు స్వాగతం పలికారు. విమానం దిగగానే మహ్మద్ బిన్ సల్మాన్ ను ఆలింగనం చేసుకున్నారు మోడీ. ఇవాళ ఇద్దరు నేతలు భేటీ కానున్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కలిసిపోరాడుతామని.. ఈ వేదిక నుంచే ఇద్దరు నేతలు ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. భారత్ రావడానికి ముందు పాకిస్తాన్ లో పర్యటించారు  సౌదీ క్రౌన్ ప్రిన్స్. పాక్ తో 20 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలు చేసుకున్నారు.

Latest Updates