పేసర్‌ షమీకి కోర్టులో ఊరట

కోల్‌కతా: ఇండియా పేసర్‌ మహ్మద్ షమీకి కోర్టులో ఊరట దక్కింది. తనపై జారీ చేసిన అరెస్ట్‌ వారెంట్‌పై  అలీపూర్‌ కోర్టు మధ్యంతర స్టే జారీ చేసింది. తనను లైంగికంగా వేధించాడని షమీ భార్య ఆరోపణలు చేయడంతో గతవారం అతనిపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయిన సంగతి తెలిసిందే. షమీపై జారీ చేసిన అరెస్ట్‌ వారెంట్‌ సాధారణమైనదేనని, ఈ కేసులో వాదనలు వచ్చే నవంబర్‌ 2 నుంచి జరుగుతాయని షమీ లాయర్‌ తెలిపారు. ప్రస్తుత స్టే రెండు నెలలపాటు అమల్లో ఉంటుందని అన్నారు.

Latest Updates