టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్‌‌కు పితృ వియోగం

టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్‌‌ తండ్రి మహ్మద్ గౌస్ (53) శుక్రవారం చనిపోయారు. ప్రస్తుతం సిరాజ్ ఆస్ట్రేలియాలో ఉన్నాడు. ఇవ్వాళ సిడ్నీలో ప్రాక్టీస్ సెషన్ తర్వాత అతడికి ఈ వార్త తెలిసింది. ఆసీస్‌‌లో క్వారంటైన్ రూల్స్ కారణంగా సిరాజ్ తిరిగి ఇండియాకు రాలేని పరిస్థితి నెలకొంది. దీంతో తండ్రి కడసారి చూపునకు సిరాజ్ దూరం కానున్నాడు. ‘నేను దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలన్నదే మా నాన్న కల. ఆయన కోసం నేను అది చేసి తీరతాను. మా నాన్న ఆటోరిక్షా నడుపుకుంటూ నేను క్రికెట్‌లో కొనసాగేలా చేశారు. ఆయన మరణం నన్ను షాక్‌‌కు గురి చేసింది. నేను దేశానికి ఆడాలన్నది ఆయన డ్రీమ్. ఆయన గర్వించేలా ఆడతా’ అని సిరాజ్ పేర్కొన్నాడు.

Latest Updates