ఆర్ఎస్ఎస్‌‌‌‌‌‌‌‌కు రాజకీయాలతో సంబంధం లేదు

మొరాదాబాద్: రాష్ట్రీయ స్వయం సేవక్​ సంఘ్(ఆర్ఎస్ఎస్)కు రాజకీయాలతో సంబంధంలేదని, దేశ సాంస్కృతిక విలువలను పెంపొందించడమే దాని లక్ష్యమని మోహన్​ భగవత్​ స్పష్టం చేశారు. దీనికోసం 60 ఏళ్ల నుంచి పాటుపడుతున్నామని వివరించారు. బీజేపీని ఆర్ఎస్ఎస్​ కంట్రోల్ చేస్తోందన్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. 130 కోట్ల మంది భారతీయుల కోసం తాము పనిచేస్తామని ఆర్ఎస్ఎస్ చీఫ్ చెప్పారు. ఉత్తరప్రదేశ్​లోని మొరాదాబాద్​లో శనివారం జరిగిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తల సమావేశంలో భగవత్​ ఈ కామెంట్స్​ చేశారు. సమాజంలోని అన్ని వర్గాల వారు ఆరెఎస్ఎస్ లో ఉన్నారని, అందులో కొంతమంది రాజకీయ పార్టీలను నడుపుతున్నారని చెప్పారు. ఎంతోమంది సంఘ సంస్కర్తలు, మేధావులు ఆర్ఎస్ఎస్​ లో భాగం కాకున్నా.. సంస్థ భావజాలంతో ఏకీభవించేవారని, ఇది ఆర్ఎస్ఎస్ సాధించిన విజయమని భగవత్​ చెప్పారు.

For More News..

కారులో 400 రోజులు.. లక్ష కిలోమీటర్లు..

గర్ల్‌ఫ్రెండ్‌తో ఓయో రూమ్‌కు.. తెల్లారేసరికి..

Latest Updates