కాడ్ బ‌రీ ర‌క్షా బంధ‌న్.. తియ్యని వేడుక

ర‌క్షా బంధ‌న్ ను క్యాష్ చేసుకోవ‌డానికి ప‌లు స్వీట్ల కంపెనీలు ఇప్ప‌టికే కొత్త వెరైటీలతో ప్ర‌చారాన్ని షురూ చేయ‌గా.. తాజాగా దేశంలోని కొన్ని ప్రముఖ చిరుతిండి బ్రాండ్స్ కూడా ప్ర‌మోష‌న్స్ స్టార్ట్ చేశాయి. ఈ క్ర‌మంలోనే రాఖీ ఉత్స‌వాల ప్ర‌చారంతో క్యాడ్ బరీ, పర్క్, హాల్స్, ఓరియో తదితర ప్రముఖ చాకొలెట్, స్నాక్స్ బ్రాండ్ల తయారీ సంస్థ మోండలెజ్ ఈ రాఖీ పండుగ కోసం ప్రత్యేకంగా కొన్ని స్వీట్ ప్యాకేజీలను విడుదల చేసింది. దీనిపై సోషల్ మీడియాలో #CloserThisRakhi పేరుతో ఓ క్యాంపెయిన్ నడుపుతోంది. అలాగే రాఖీ పండుగ కోసం ఆన్ ‌లైన్ ‌లో ప్రత్యేకంగా చాకొలెట్ గిఫ్ట్ బాక్సులను క‌స్ట‌మ‌ర్ల‌కు అందుబాటులోకి తెచ్చింది.

రాఖీ పండుగ సమయంలో తోబుట్టువుల జీవితాల్లో మరింత ఆనందాన్ని పంచడమే తమ ఉద్దేశ్యమని మోండలెజ్ ఇండియా కంపెనీ మార్కెటింగ్ డైరెక్టర్ అనిల్ విశ్వనాథన్ చెప్పారు. క్యాడ్ బరీ వంటి ప్రముఖ బ్రాండ్లను తయారుచేస్తున్న మోండలెజ్.. తరతరాలుగా పండుగల సమయంలో ప్రజల్లో సంతోషాలు పంచుతూనే ఉందన్నారు. ఇప్పుడు కొత్తగా ప్రారంభించిన క్లోజర్ దిస్ రాఖీ క్యాంపెయిన్ ‌తో కూడా తాము ప్రేమించే కుటుంబంతో బంధాలను బలపరచుకోవాలనే మెసేజ్ సంస్థ ఇస్తోందన్నారు అనిల్ విశ్వ‌నాథ‌న్.

Latest Updates