డాక్టర్ గెటప్​లో ఐసీయూకు వెళ్లి డబ్బులు డిమాండ్

డాక్టర్ గెటప్​లో ఐసీయూకు వెళ్లి డబ్బులు డిమాండ్
  • సర్జరీ పేరుతో డబ్బులు డిమాండ్
  • యువకుడిపై కేసు ఫైల్ చేసిన పంజాగుట్ట పోలీసులు

ఖైరతాబాద్, వెలుగు: డాక్టర్ గెటప్ లో హాస్పిటల్ లోని ఐసీయూకు వెళ్లి సర్జరీ పేరుతో  పేషెంట్ సహాయకురాలినిడబ్బులు డిమాండ్ చేసిన వ్యక్తిపై పంజాగుట్ట పీఎస్ లో కేసు నమోదైంది. సంతోశ్ నగర్ కు చెందిన మహ్మద్ జకీరుద్దీన్(19) ఈ నెల 16న డాక్టర్ గెటప్ లో బంజారాహిల్స్ రోడ్ నం.12లోని విరించి హాస్పిటల్ కు వెళ్లాడు. ఐసీయూలోకి వెళ్లి ఓ పేషెంట్ కేస్ షీట్ ను నర్సు ద్వారా తెప్పించుకున్నాడు. కేస్ షీట్ లో ఉన్న పేషెంట్ సహాయకురాలికి కాల్ చేశాడు. సర్జరీ చేయాలని.. వెంటనే రూ.15 వేలు కట్టాలని చెప్పాడు. తాము ఈఎస్ఐ కింద హాస్పిటల్ లో జాయిన్ అయ్యామని.. డబ్బులు ఎందుకు ఇవ్వాలంటూ ఆమె చెప్పడంతో జకీరుద్దీన్ అక్కడి నుంచి పారిపోయాడు. పేషెంట్ సహాయకురాలు విషయాన్ని  హాస్పిటల్ దృష్టికి తీసుకెళ్లడంతో ఫేక్ డాక్టర్ వ్యవహారం బయటపడింది. జకీరుద్దీన్ తో పాటు సెక్యూరిటీలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన హాస్పిటల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలంటూ ఆమె పంజాగుట్ట పీఎస్ లో శుక్రవారం  కంప్లయింట్ చేసింది. జకీరుద్దీన్ పై కేసు ఫైల్ చేశారు.