లంచం డిమాండ్ : ACBకి చిక్కిన వ్యవసాయ అధికారిని

ఆంధ్రప్రదేశ్ : మరో అవినీతి చేప ACBకి చిక్కింది. విశాఖపట్నం చోడవరంలో లంచం తీసుకుంటుండగా ఎసిబికి దొరికింది వ్యవసాయ అదికారి కర్రీ ఉమాదేవి. ఎరువుల షాపు లైసెన్సు రెన్యువల్ కోసం పసుముర్తి అదినారాయణ దగ్గర చోడవరం వ్యవసాయ అధికారి ఉమాదేవి,ఎక్సటెన్సన్ అదికారి జగన్నధం 19వేలు లంచం డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ACB అధికారులకు తెలిపారు ఆదినారాయణ. దీంతో పక్కా ప్లాన్ తో శుక్రవారం లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు ACB అధికారులు. వారి దగ్గరి నుంచి రూ.19 వేలు స్వాదీనం చేసుకున్న అధికారులు..పోలీసులకు సమాచారం అంధించారు.

Latest Updates