టీఆర్‌‌ఎస్‌‌కు మస్తు డొనేషన్

దేశంలో సెకండ్‌‌ప్లేస్‌ 2018–19లో రూ. 41 కోట్ల విరాళాలు
వివరాలు వెల్లడించిన ఏడీఆర్‌‌
రూ. 80 కోట్లతో వైఎస్సార్‌‌కాంగ్రెస్‌‌ టాప్

హైదరాబాద్‌‌, వెలుగు: హయ్యెస్ట్‌‌డొనేషన్లు పొందిన రీజనల్ ‌పార్ల్టీలో టీఆర్‌‌ఎస్ ‌‌రెండో ప్లేస్‌‌లో నిలిచింది. 2018-=19 ఫైనాన్యషి ల్‌ ఇయర్‌‌లో పార్టీకీ రూ.41.27 కోట్ల విరాళాలొచ్చాయి. వైఎస్సార్ ‌‌కాంగ్రెస్ ‌‌పార్టీ రూ. 80.57 కోట్లతో మొదటి స్థానంలో నిలిచింది. ఈ మేరకు రాజకీయ పార్టీలు ఎలక్షన్ ‌కమిషన్‌‌కు సమర్పించిన డొనేషన్లవివరాలను నేషనల్‌‌ఎలక్షన్ ‌‌వాచ్‌ పేరుతో అసోసియేషన్ ‌ఫర్ ‌‌డెమోక్రటిక్‌‌ రిఫార్మ్స్‌‌(ఏడీఆర్‌‌) సంస్థ బుధవారం ప్రకటించింది.52 రిజిస్టర్డ్ ‌‌ప్రాంతీయ పార్టీల్లో 15 పార్టీలే ఈసీకి విరాళాల వివరాలు వెల్లడించాయని, 37 పార్టీలు ఇవ్వలేదని చెప్పింది. విరాళాలు పొందిన టాప్‌‌10 రీజనల్‌‌పార్ల్టీలో తెలుగు రాష్ట్రాలవే మూడున్నాయి. వైసీపీ, టీఆర్‌‌ఎస్ ‌‌తర్వాత నాలుగో స్థానంలో టీడీపీ నిలిచింది. ఈ పార్కి టీ రూ.26.17 కోట్లు అందాయి. మూడో ప్లేస్‌‌లో బీజేడీ (రూ.29.31 కోట్లు) ఉంది.

టాప్‌‌టెన్‌‌లోనూ 5 పార్టీలు దక్షిణాది రాష్ట్రాలవే ఉన్నాయి. వీటిల్లో తెలుగు రాష్ట్రాలవి మూడు, తమిళనాడువి రెండున్నాయి. ఒక్క ఏడాదిలోనే 10 రెట్లు 2017=18లో వైసీపీకి రూ.8.35 కోట్లు విరాళాల రూపంలో రాగా ఆ తర్వాతి ఏడాది 10 రెట్లు ఎక్కువగా రూ. 80.57 కోట్లు వచ్చాయి. టీఆర్‌‌ఎస్‌‌కు 2017=18లో రూ. 3.30 కోట్లు రాగా 2018-=19లో రూ.41.27 కోట్లు అందాయి. టీడీపీకి 2017=-18లో రూ.173 కోట్లు, 2018-=19లో రూ.26.17 కోట్లు వచ్చాయి. ప్రాంతీయ పార్టీలకు రూ.230 కోట్లు దేశంలోని ప్రాంతీయ పార్లటీ న్నింటికీ కలిపి 2018-=19 ఫైనాన్యషిల్ ‌‌ఇయర్‌‌లో రూ.230.45 కోట్ల విరాళాలు రాగా అందులో 1.39 శాతం (రూ.3.20 కోట్లు) మాత్రమే నగదు రూపంలో వచ్చినట్టు ఏడీఆర్‌ వెల్లడించింది. మిగతా విరాళాలన్నీ ఎలక్టోరల్ ‌‌బాండ్లుగా వచ్చాయంది. క్యాష్‌ డొనేషన్స్‌‌లో డీఎంకేకు ఎక్కువగా రూ.2.97 కోట్లు, పీఎంకేకు రూ.10.60 లక్షలు సమకూరాయి. ఎన్‌‌పీఎఫ్‌, డీఎంకే పార్టీల‌కు వచ్చిన క్యాష్‌ డొనేషన్లలో రూ.1.59 కోట్లకు లెక్కల్లేవని ఏడీఆర్‌ ‌వెల్లడించింది.

Latest Updates