గుజరాత్ సింగర్ పాటలకు ఫిదా: కురిసిన నోట్ల వర్షం

గుజరాతీలో ఫేమస్ సింగర్ పాటలకు ఫిదా అయ్యారు సూరత్ వాసులు. కడోదరలో జరిగిన ఓ వివాహ వేడుకలో సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు. దేశభక్తి  పాటలు సహా సంప్రదాయ గుజరాతీ సాంగ్స్ పాడి ఆహూతులను అలరించింది భజన బృందం. దీంతో వివాహ వేడుకకు వచ్చిన వారు సింగర్ పై నోట్ల వర్షం కురిపించారు. అమెరికన్ డాలర్లతో పాటు, దేశ కరెన్సీని వెదజల్లారు. అలా జమ అయిన మొత్తాన్ని భద్రతా దళాలకు పంపుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Latest Updates