ఊరంతా సైబర్ నేరగాళ్లే: 17 రోజుల్లో రూ.3కోట్లు కొట్టేశారు

‘20 ఏళ్ళ లోపు యువతే. 7,8వ తరగతి ఫెయిల్. మారుమూల గ్రామాల్లో ఉంటారు. కానీ హైటెక్ తరహాలో అకౌంట్లు ఖాళీ చేస్తారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఊరంతా సైబర్ నేరగాళ్లే. చేతిలో స్మార్ట్ ఫోన్ తో పక్కా స్కెచ్ వేసి 17 రోజుల్లో రూ.3కోట్లు కొట్టేశారు. ఇదీ జార్ఖండ్ సైబర్ దొంగల ముఠా నయా సైబర్ క్రైమ్ హిస్టరీ’

బ్యాంకులను టార్గెట్ చేసి పిన్ నంబర్లు తెలుసుకుంటున్న ముఠా ఆటకట్టించారు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. ఏటీఎం, ఓటీపీ, సీవీవీ కోడ్ నంబర్ లేకుండానే డబ్బులు ఖాజేస్తున్న 10మంది సభ్యుల జార్ఖండ్ సైబర్ గ్యాంగ్‌ను అరెస్ట్ చేశారు. నిందితులనుంచి నకిలీ డెబిట్ కార్డులు, కార్డ్‌ రీడర్లను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్ కాల్ సెంటర్లకు ఫోన్ చేసి అకౌంట్లు ఖాళీ చేస్తున్న అంతర్రాష్ట్ర సైబర్ దొంగల ముఠా వివరాలను క్రైమ్స్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని, సైబర్ క్రైమ్స్ ఏసీపీ శ్రీనివాస్ తో కలిసి సైబరాబాద్ సీ పీసజ్జనార్ బుధవారం వెల్లడించారు.

వాలెట్ రెడ్ బస్ అడ్డాగా
జార్ఖండ్‌లో అదో మారుమూల ప్రాంతం. జాంతార్ జిల్లా కర్మటర్ గ్రామం. ఆ ఊర్లో దుర్యోధన్ మండల్(22) సైబర్ దొంగల ముఠాను ఏర్పాటు చేశాడు. కుటుంబ సభ్యులతో పాటు బంధువులతో కూడిన దుర్యోధన్ కార్డ్ క్లోనింగ్ గ్యాంగ్ హైటెక్  సైబర్ దోపిడీలు చేసేది. వీరు 2011–12నుంచి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నా మంటు ఫోన్లు చేసి డెబిట్ కార్డ్ పిన్ నంబర్స్, సీవీవీ కోడ్ తెలుసుకొని బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసేవారు. దీంతో పాటు ఈ వాలెట్, యునిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేజ్(యూపీఐ) సిస్టమ్ తో రూ.20వేల చొప్పున డబ్బు ట్రాన్స్ ఫర్ చేసుకునే వారు. ఇలా సైబర్ చోరీల్లో ఈ గ్యాంగ్ ప్రావీణ్యం సంపాదించింది. అయితే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ క్లోనింగ్‌తో పాటు ఓటీపీ పిన్ నంబర్లపై ప్రజల్లో అవగాహన పెరగడంతో గ్యాంగ్ రూట్ మార్చింది.

17 రోజుల్లో 3లక్షల కాల్స్
మార్చి 13వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కేవలం 17 రోజుల్లోనే ఐసీఐసీఐ బ్యాంక్‌ టోల్ ఫ్రీ నంబర్ కు ఈ గ్యాంగ్ మూడు లక్షల కాల్స్ చేసింది. ఇలా తమ దగ్గరున్న ఖాతాదారుల అకౌంట్ నంబర్ తో బ్యాంక్ బ్యాలెన్స్, డె బిట్ కార్డ్, ఏటిఎం పిన్ నంబర్ లను తెలుసుకున్నారు. 900 ఫోన్ నంబర్లతో దేశవ్యాప్తంగా3500 ఏటిఎం కార్డుల పిన్ నంబర్లను ఈ గ్యాంగ్ సేకరించింది. ఆ తరువాత తమ వద్ద ఉన్న క్లోనింగ్ డెబిట్ కార్డ్స్ రీరైట్ చేసింది. దీంతో బ్యాంకు ఖాతాదారుల ఏటిఎం కార్డ్స్, పిన్ నంబర్లతో సహా దుర్యోధన్ మండల్ గ్యాంగ్ చేతుల్లోకి వచ్చాయి. ఇలా రీరైట్ చేసిన డెబిట్ కార్డుల సాయంతో వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, బీహార్, ఢిల్లీ, కర్నాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణతో పాటు మొత్తం 12 రాష్ట్రల్లో నగదును డ్రాచేశారు. పోలీసులకు చిక్కకుండా విమానాల్లో ప్రయాణం చేస్తూ ఈ ముఠా అకౌంట్లు ఖాళీ చేసింది.1044 ఏటిఎం కార్డులతో రూ.3 కోట్ల నగదును ఏటిఎం సెంటర్ల నుంచి విత్ డ్రా చేశారు. ఇందులో హైదరాబాద్ కు చెందిన 18 బ్యాంకు అకౌంట్లకు చెందిన 11 మంది ఖాతాదారుల పిన్ నంబర్లతో ఈగ్యాంగ్ డబ్బులు డ్రా చేసింది. ఐతే మార్చ్ నెలలో అతితక్కువ సమయంలోనే తమ ఐవీఆర్ కు మూడు లక్షలకాల్స్ రావడంతో గచ్చిబౌలిలోని ఐసీఐసీఐకి చెందినసిబ్బంది అలెర్ట్ అయ్యారు. ఫైనాన్సియల్ క్రైమ్ ప్రివెన్షన్ గ్రూప్ కు చెందిన రీజనల్ మేనేజర్ సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఇలా దొరికారు
దర్యాప్తు ప్రారంభించిన సైబర్ క్రైమ్ పోలీసులు ఈదోపిడీ అంతా జార్ఖండ్‌లోని జాంతార్ జిల్లా కర్మటర్ నుంచి జరిగిందని గుర్తించారు. సైబర్ క్రైమ్ ఏసీపీశ్రీనివాస్ రావు ఆధ్వర్యంలోని శ్యాం బాబు స్పెష ల్ టాస్క్ ఫోర్స్ టీమ్ నిందితుల కోసం జాంతార్ లో గాలించింది. ఇందులో ప్రధాన నిందితుడు దుర్యోధన్ మండల్ తో పాటు తొమ్మిది మంది సభ్యుల ముఠాను గుర్తించింది. అయితే ఈ గ్యాంగ్ ఉండే ఏరియాలు సమస్యాత్మక ప్రాంతాలు కావడంతో అర్ధరాత్రి దాడిచేసి సంజయ్ కుమార్, వీరేంద్ర కుమార్, ధనంజయ్,నిరంజన్, ప్రకాశ్‌, గణేశ్‌, కమలేశ్‌, రాజేంద్ర, పింకూ కుమార్ లను అరెస్ట్ చేసింది. నిందితుల నుంచి 1044క్లోన్ చేసిన ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకుంది. ఈ తరహా సైబర్ క్రైమ్ దేశంలోనే మొదటిది కావడంతో సైబరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. రానున్న రోజుల్లో ఇలాంటి నేరాలకు ఆస్కారం లేకుండా బ్యాంకులతో సదస్సులు నిర్వహిస్తామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. దీనికి బ్యాంకులే బాధ్యత వహిస్తాయని సీపీ స్పష్టం చేశారు.

ఇలా క్లోనింగ్‌ చేశారు
ఖాతాదారులను కాకుండా ఏకంగా బ్యాంకులనే టార్గెట్ చేసి ఏటిఎం కార్డ్ పిన్ నంబర్లు తెలుసుకుందీ ముఠా. తమకు కార్డ్ క్లోనింగ్‌లో ఉన్నఅనుభవంతో జాతీయ బ్యాం కుల అకౌంట్లనుఖాళీ చేసేం దుకు ప్లాన్ చేసింది. అందుకోసంజాతీయ బ్యాం కులకు చెందిన బ్యాంక్ ఐడెంటిఫికేషన్ నంబర్లు(బీ.ఐ.ఎన్) సేకరించింది .ఇవాలెట్ లోని రెడ్ బస్ అప్లికేషన్ యాప్ లో ఉన్న లోపాలను తెలుసుకొని బ్యాంక్ అకౌంట్ల నంబర్ లను ఈ ముఠా తెలుసుకొనేది. బస్ టిక్కెట్లను బుక్ చేసుకునేందుకు ఈ స్మా ర్ట్ ఫోన్ యాప్ అందుబాటులో ఉండడంతో దీన్నే తమసైబర్ ఫ్రాడ్ కు అనుకూలంగా చేసుకున్నారు. ఈ యాప్ లో బ్యాంక్ అకౌంట్ నంబర్ రాయాల్సిన స్థానంలో తాము టార్గెట్ చేసుకున్న జాతీయ బ్యాంక్ నంబర్ టైప్ చేస్తారు.16 అంకెల బీఐఎన్  సిరీస్ లోని మొదటి ఆరు నంబర్లను రాస్తారు. ఆ తరువాత మిగిలిన ఆరునంబర్లను వరుసగా టైప్ చేస్తూ ఉంటారు. ఇలాఇవాలెట్ రెడ్ బస్ యా ప్ లో అకౌంట్ నంబర్ మ్యాచ్ ఐతే వాటిని పేపర్ పై నోట్ చేసుకుంటారు. అకౌంట్ నంబర్ ఆధారంగా సంబంధిత బ్యాంకుల ఇంట్రాక్టీవ్ వాయిస్ రెస్పాన్స్ (ఐవీఆర్) టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేస్తారు. తాము హ్యా క్ చేసిన అకౌంట్ నంబర్ తో ఏటీఎం పిన్ నంబర్లను ఈ గ్యాంగ్ తెలుసుకునేది. ఇలా పిన్ నంబర్లను తెలుసుకుని తమదగ్గరున్న అకౌంట్ నంబర్లతో మ్యా చ్ చేసేది.

Latest Updates