జన్ ధన్ అకౌంట్ల లో డబ్బులు సేఫ్

  • ఎప్పుడైనా విత్ డ్రా చేసుకోవచ్చు, వదంతులు నమ్మొద్దన్న కేంద్రం

న్యూఢిల్లీ: మహిళల జన్ ధన్ అకౌంట్లలో ప్రభుత్వం జమ చేసిన డబ్బులు సేఫ్ గా ఉంటాయని, ఎప్పుడైనా విత్ డ్రా చేసుకోవచ్చని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. వెంటనే విత్ డ్రా చేసుకోకుంటే వెనక్కి తీసుకుంటారన్న వదంతులను నమ్మవద్దని చెప్పింది. లాక్ డౌన్ రిలీఫ్ ప్యాకేజ్ లో భాగంగా 20.5 కోట్ల మంది మహిళలకు నెలకు రూ.500 చొప్పున మూడు నెలలపాటు అందజేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత నెల ప్రకటించారు. జన్ ధన్ ఖాతాల్లో ఈ క్యాష్ ను జమ చేస్తామని చెప్పారు. ఇటీవల జన్ ధన్ అకౌంట్లలో జమ కూడా చేశారు. ప్రభుత్వం జమ చేసిన డబ్పులను వెంటనే విత్ డ్రా చేసుకుకోంటే వెనక్కి తీసుకుంటారని వదంతులు వచ్చాయి. దీంతో మహిళలంతా బ్యాంకులకు క్యూ కట్టారు. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టత ఇచ్చింది. “జన్ ధన్ అకౌంట్లలో జమ చేసిన డబ్బులు సేఫ్ గా ఉంటాయి. అకౌంట్ హోల్డర్ మాత్రమే ఏటీఎం లేదా బ్రాంచ్ నుంచి ఎప్పుడైనా విత్ డ్రా చేసుకోవచ్చు. వదంతులు నమ్మవద్దు” అని ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ ట్వీట్ చేశారు.

Latest Updates