వైరల్: సైకిల్ పై వచ్చి చిన్నారి కిడ్నాప్ కు ప్రయత్నించిన కోతి

న్యూఢిల్లీ: ఓ ఆకతాయి కోతి సైకిల్ నడుపుకుంటూ వచ్చి ఒక చిన్నారిని కిడ్నాప్ చేసేందుకు యత్నించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో చిన్నపాటి బైక్ మాదిరిగా ఉన్న సైకిల్ పై వేగంగా దూసుకొచ్చిన కోతి.. దాని మీద నుంచి జంప్ చేసి దగ్గర్లో బెంచీపై కూర్చున్న చిన్న పాపను ఈడ్చుకెళ్లేందుకు ప్రయత్నించింది. వెంటనే సమీపంలో ఉన్న వాళ్లు అరవగానే పాపను వదిలేసి కోతి అక్కడి నుంచి పరారైంది. కోతి బారి నుంచి బయటపడ్డ పాప వెంటనే లేచి తను కూర్చున్న బెంచీ దగ్గరికి వెళ్లిపోయింది.

ఈ వీడియో ను అమెరికా బాస్కెట్ బాల్ ప్లేయర్ రెక్స్ చాప్ మన్ ట్విట్టర్ లో షేర్ చేశాడు. ‘ఒక కోతి సైకిల్ ను నడుపుకుంటూ వచ్చి పాపను కిడ్నాప్ చేయడానికి ట్రై చేయడం చివరగా ఎప్పుడు జరిగిందో తనకు గుర్తులేదని రాసి అతడు ఈ వీడియోను పోస్ట్ చేశాడు. ఈ వీడియోకు ఇప్పటికే 6 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.

Latest Updates