క్రైమ్ థ్రిల్లర్ "మూడు చేపల కథ" పోస్టర్ రిలీజ్

క్రైమ్ థ్రిల్లర్ "మూడు చేపల కథ" పోస్టర్ రిలీజ్

"సమంత" చిత్రంతో దర్శకుడిగా పరిచయమై, తొలి చిత్రంతోనే దర్శకుడిగా తన ప్రతిభను ప్రకటించుకున్న యువ ప్రతిభాశాలి ముఖేష్ కుమార్ తెరకెక్కించిన ద్వితీయ చిత్రం "మూడు చేపల కథ". షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రఖ్యాత రచయిత యండమూరి వీరేంద్రనాథ్ విడుదల చేశారు. రియలిస్టిక్ డాక్యుమెంటరీ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ లోని సత్యసాయి జిల్లా, కదిరిలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా చిత్రీకరించారు. పృథ్వి, అర్షద్ షేక్, బాలాజీ, సాయినాథ్, హర్ష, రెహ్మాన్, అనంతనేని గోపాలకృష్ణ, యాంకర్ సత్తెన్న, ధీరజ అప్పాజీ, శేషు కుమార్, ముఖేష్ కుమార్ నటించిన ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, అసిస్టెంట్ డైరెక్టర్స్ గా వ్యవహరిస్తున్నారు.