కీసర MRO నాగరాజుతో పాటు మ‌రో ముగ్గురు నిందితుల అరెస్ట్

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా: 28 ఎకరాల ల్యాండ్ సెటిల్మెంట్ కోసం రియల్ ఎస్టేట్ వ్యక్తుల నుంచి రూ.2 కోట్లు డిమాండ్ చేసి, రూ.1.10 కోట్లు లంచంగా తీసుకుంటూ కీసర తహసీల్దార్ నాగరాజు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన విష‌యం తెలిసిందే. ఈ కేసులో శ‌నివారం కీసర ఎమ్మార్వో నాగరాజుతో పాటు మ‌రో ముగ్గురు నిందితులు అంజిరెడ్డి, శ్రీనాథ్, సాయిరాజ్ ల‌ను అరెస్ట్ చేశారు. వారిని నాంపల్లి ఏసీబీ కార్యాలయం నుండి వైద్యపరీక్షలకు తరలించారు. వైద్యపరీక్షల అనంతరం న్యాయమూర్తి ముందు హాజరు పర్చనున్నట్లు తెలిపారు ఏసీబీ అధికారులు.

Latest Updates