డిప్రెషన్‌‌ అమ్మాయిలకే ఎక్కువ!

డిప్రెషన్‌‌.. ఈరోజుల్లో సాధారణంగా వినిపించే మాట. కానీ, ఇదొక తీవ్రమైన సమస్య. అలాగని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.  ఇతర జబ్బుల మాదిరిగానే దీనిని నయం చేసుకోవచ్చు. అయితే టీనేజ్‌‌లో డిప్రెషన్‌‌ తాలుకు ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువగా దీనిబారిన పడుతున్నారని పరిశోధకులు(రీసెర్చర్స్‌‌) గుర్తించారు.  అదే టైంలో వేగంగా పెరిగిపోతున్న కుంగుబాటు సమస్యకి ప్రధాన కారణాన్ని గుర్తించగలిగారు. అవేంటో చూద్దాం…

గత పదేళ్లుగా డిప్రెషన్‌‌ బారిన పడుతున్న వాళ్లు పెరిగిపోతున్నారు. తమను తాము ఇబ్బంది పెట్టుకుంటున్నవాళ్లు, గాయపర్చుకుంటున్నవాళ్లు, సూసైడ్‌‌ దాకా వెళ్తున్న కేసులు పెరిగాయి.  సూసైడ్ రేటింగ్‌‌లో ఎక్కువ బాధితులు మగవాళ్లే ఉంటున్నారు.  కానీ, డిప్రెషన్‌‌ బారినపడి ట్రీట్‌‌మెంట్ తీసుకుంటున్నవాళ్లలో ఆడవాళ్లు.. ముఖ్యంగా టీనేజీ అమ్మాయిల శాతమే ఎక్కువగా ఉంటోంది. ఇందుకు ప్రధాన కారణం స్మార్ట్ ఫోన్స్‌‌ .. అందులో ప్రత్యేకించి డిజిటల్‌‌ మీడియా వాడకం.  జనరేషన్‌‌ Z(iజనరేషన్‌‌) అంటే.. 95 తర్వాత పుట్టిన తరం.  ఇంటర్నెట్‌‌ను మొట్టమొదటగా పూర్తిస్థాయిలో ఎక్కువగా వాడుకుంది వీళ్లే.  అంతేకాదు సోషల్ లైఫ్‌‌లో సోషల్ మీడియా వాడకాన్ని అనివార్యం చేసింది ఈ జనరేషన్‌‌వాళ్లే. ఆ తర్వాత మెల్లిగా మిగతా జనరేషన్స్‌‌ కూడా సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయ్యాయి.  ఒకేసారి స్మార్ట్ ఫోన్స్‌‌, సోషల్ మీడియాల వాడకం మొదలుపెట్టినప్పుడు.. కేవలం ఆడవాళ్ల మెంటల్‌‌ హెల్త్‌‌ పైనే ప్రభావం పడటానికి కారణం మాత్రం స్క్రీన్స్‌‌ ప్రెజన్స్‌‌.

స్క్రీన్‌‌ ప్రెజన్స్‌‌

ఈ తరం యువత డిజిటల్ మీడియా టైమ్‌‌ని రకరకాల పద్ధతుల్లో వాడుతోంది. అబ్బాయిలు గేమింగ్‌‌కు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు.  ఎడల్ట్‌‌ కంటెంట్‌‌, సోషల్ పోస్టింగులు తర్వాతి ప్లేసులో ఉన్నాయి. అమ్మాయిల విషయానికొస్తే..  మెసేజ్‌‌లు పంపడం, ఫొటోలు, వీడియోల అప్‌‌లోడింగ్‌‌ కోసం  ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు.  గేమింగ్‌‌లో కమ్యూనికేషన్‌‌ డిఫరెంట్‌‌గా ఉంటుంది. కానీ, మెసేజ్‌‌లు, ఫొటో, వీడియోల అప్‌‌లోడింగ్‌‌లో మాత్రం అలా ఉండదు. ఏదైనా షేర్‌‌ చేసినప్పుడు, పోస్ట్‌‌ చేసినప్పుడు రెస్పాన్స్‌‌ కోసం ఎదురుచూపులు తప్పవు. ఇదే అమ్మాయిల్లో ఆందోళన, ఒత్తిడి పెరిగిపోవడానికి కారణమవుతోంది.

ఉదాహరణకు ఒక అమ్మాయికి ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో వేల సంఖ్యలో ఫాలోయర్స్‌‌ ఉన్నారు. ఒక ఫొటో అప్‌‌లోడ్‌‌ చేయగానే లైక్స్‌‌, కామెంట్స్‌‌ కుప్పలుగా వస్తాయి. అదే టైంలో తక్కువ టైంలో మరొక అమ్మాయి అదే రేంజ్‌‌ ఫాలోయింగ్‌‌ని సంపాదించుకుంది.  ఇది వాళ్లిద్దరి మధ్య సోషల్ మీడియాలో పోటీకి కారణమవుతోంది. ఇన్‌‌స్టాగ్రామ్‌‌, టిక్‌‌టాక్‌‌, ట్విట్టర్‌‌, స్నాప్‌‌చాట్‌‌.. ఇలా ఏ ప్లాట్‌‌ఫామ్‌‌ చూసుకున్నా తమ సోషల్ పవర్‌‌ని చూపించుకోవాలనే తాపత్రయం అమ్మాయిల్లో పెరిగిపోతోంది. దీనికితోడు కామెంట్‌‌ డిసేబుల్‌‌, పోస్టులు డిలీట్‌‌ చేయడం, రీ–పోస్టులు, ఎడిటింగ్‌‌.. ఇలా రకరకాల కారణాలు వాళ్లను ఒత్తిడికి గురిచేస్తున్నాయి. ఫాలోయర్స్‌‌ని పెంచుకునేందుకు రకరకాల మార్గాల్ని అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో నిద్రకు దూరమై మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసుకుంటున్నారు.

సంతోషానికి దూరంగా..

డిజిటల్ మీడియా టైం ఎక్కువసేపు గడపటమే కాదు.. దాని కారణంగా ప్రతికూల ప్రభావానికి(నెగెటివ్ ఎఫెక్ట్స్‌‌) గురవుతున్నది కూడా అమ్మాయిలే. ఇంతకుముందు చాలా సర్వేలు ఇదే విషయాన్ని చెప్పాయి.  ఎక్కువ డిప్రెషన్‌‌, సంతోషం లేకపోవడం..  అబ్బాయిలకంటే అమ్మాయిల్లోనే ఎక్కువ గుర్తించారు కూడా. అమెరికాకు చెందిన ‘ది కన్వర్జేషన్‌‌’ అనే ఆర్గనైజేషన్‌‌ కిందటి ఏడాది ఒక సర్వే నిర్వహించింది. ఒకరోజులో అరగంట సోషల్ మీడియాలో గడిపిన వంద మంది అమ్మాయిల్లో15 మంది సంతోషంగా లేరు. ఆరు గంటలు గడిపిన వంద మందిలో 26 మంది అసంతృప్తిగా ఉన్నారు.  అబ్బాయిల్లో కేవలం పదకొండు, పద్దెనిమిది మంది మాత్రమే డిప్రెషన్‌‌ బారినపడినట్లు గుర్తించారు.  ఇప్పుడు రెండు లక్షల మందితో ది కన్వర్జేషన్‌‌ నిర్వహించిన సర్వేలోనూ డిజిటల్ మీడియా ఎఫెక్ట్‌‌ను గుర్తించారు.

బ్రేక్‌‌ అందుకే!

సోషల్ మీడియా ప్లాట్‌‌ఫామ్స్‌‌ని యూజర్లు అడిక్టివ్‌‌ కావడానికి రకరకాలుగాడిజైన్‌‌ చేస్తారు. ఎంత ఎక్కువసేపు గడిపితే ఆ ప్లాట్‌‌ఫామ్‌‌ కంపెనీలకు అంత డబ్బు వస్తది.  యూత్‌‌ తమ మెంటల్‌‌ హెల్త్‌‌ పాడుచేసుకుని మరీ పెడుతున్న డబ్బుగా అభివర్ణిస్తుంటారు మేధావులు.  సోషల్ మీడియా వల్ల జరుగుతున్న డ్యామేజ్‌‌ అందరికీ తెలుసు. ఈ విషయాలపై గ్రూపులుగా మాట్లాడుకుంటారు కూడా. కానీ, వాటి వల్ల కలిగే ఆందోళనను, బాధల గురించి ఒకానొక దశలో చర్చించలేరు. ఈ స్ట్రెస్‌‌ నుంచి బయటపడేందుకు చాలామంది సోషల్‌‌ మీడియాకు బ్రేక్‌‌ ఇస్తుంటారు. ఆ టైంలో వాళ్ల గురించి ఫాలోయర్స్‌‌ పొరపడే అవకాశాలుంటాయి. కాబట్టి, వాళ్లకు నచ్చజెప్పే విధంగా విరామం ఇస్తే బెటర్‌‌. మరోవైపు పేరెంట్స్‌‌ పిల్లల సోషల్ మీడియా ఎంట్రీని పోస్ట్ పోన్‌‌ చేయాలి.  చాలా దేశాల్లో పదమూడేళ్లు దాటాకే సోషల్ మీడియా వాడాలనే కండిషన్‌‌ ఉంటుంది.  కాస్త వయసు పెరిగిన వాళ్లలో ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పిల్లల్ని ఓ కంట కనిపెడుతూ ఉండాలి.

సైకలాజికల్ ఫ్యాక్టర్స్‌‌


సోషల్ మీడియాలో ఫేస్‌‌ టు ఫేస్‌‌ ఇంటరాక్షన్‌‌ అమ్మాయిలను బాగా ఆకర్షిస్తుంది. ఈ క్రమంలో పాపులారిటీ, పాజిటివ్‌‌ సోషల్ ఇంటరాక్షన్స్‌‌.. వాళ్ల సంతోషానికి కారణాలవుతున్నాయి.  ఆ హ్యాపీనెస్‌‌ అబ్బాయిలకంటే అమ్మాయిలకే ఎక్కువ.  అదే టైంలో బుల్లీయింగ్‌‌, షేమింగ్‌‌, లేనిపోని వివాదాలు.. వాళ్లకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి.  అప్పియరెన్స్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. నెగెటివ్‌‌ కామెంట్స్‌‌, తక్కువ ఫాలోయింగ్‌‌ లాంటి అంశాలు వాళ్లను కుంగదీస్తున్నాయి.  ఈ విషయంలో అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయి మెంటల్‌‌ హెల్త్ కండిషన్‌‌ మెరుగ్గా ఉండటం విశేషం.

see also:‘నారప్ప’ రచ్చ : మా వాళ్లే రియల్‌‌ హీరోలు..!

హిందీ, ఇంగ్లీష్​ సినిమాలతో లైంగిక నేరాలు

ప్రధాని మోడీకి ఏరియల్ ఎటాక్ ​ముప్పు!

Latest Updates