ఆన్‌‌లైన్ కంపెనీల్లో జాబ్స్ జోరు

కోల్‌‌‌‌కతా: దేశంలో లీడింగ్ ఆన్‌‌లైన్ సంస్థలు అమెజాన్, మింత్రాలు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రత్యేక సేల్స్‌‌ను ప్రారంభించాయి. ఈ సేల్స్‌‌కు వస్తోన్న డిమాండ్‌‌ను అందుకోవడానికి కంపెనీలు తాత్కాలికంగా ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. ముఖ్యంగా డెలివరీ రోల్స్‌‌లో ఈ నియామకాలున్నాయి. ఈకామర్స్ సంస్థలు తాత్కాలిక స్టాఫ్‌‌ను నియమించుకుంటున్నాయని క్వెస్, టీమ్‌‌లీజ్‌‌, మాన్‌‌పవర్‌‌లు
తెలిపాయి. రిక్రూట్ చేసుకునే తాత్కాలిక ఉద్యోగుల్లో, సేల్స్, అడ్వయిజరీ, కంటెంట్ డెవలప్‌‌మెంట్ విభాగాలు ఉన్నాయి. ఆన్‌‌లైన్ సంస్థల తర్వాత ఎక్కువగా ఉద్యోగాలిస్తోన్నవాటిల్లో హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు, ఇన్సూరెన్స్ అగ్రిగేటర్లు, ఎడ్‌‌టెక్ సెక్టార్‌ ఉన్నాయి. రిక్రూట్ చేసుకునే కంపెనీల్లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌‌డీల్, స్విగ్గీ, వేదాంతు, అన్‌‌అకాడమీ, పీఎన్‌‌బీ మెట్‌‌లైఫ్, టాటా ఏఐజీ వంటివి ఉన్నట్టు స్టాఫింగ్ సంస్థలు తెలిపాయి. ఆర్డర్ వాల్యుమ్, కొత్త కస్టమర్ల విషయంలో తాము 50–100శాతం గ్రోత్‌‌ను నమోదు చేస్తున్నామని ఈకామర్స్ సంస్థలు రిపోర్ట్ చేశాయి. ఎకానమీ మొత్తం తిరిగి ప్రారంభమయ్యాక ఇది చాలా మంచి పరిణామమని, క్వెస్ కార్ప్ వర్క్‌‌ఫోర్స్ మేనేజ్‌‌మెంట్ ప్రెసిడెంట్ లోహిత్ భాటియా అన్నారు. గ్రోసరీ, ఫుడ్, మెడిసిన్స్ వంటి అత్యవసర సర్వీసెస్‌‌కు చెందిన డెలివరీ కంపెనీల నుంచి కూడా హైరింగ్ డిమాండ్ వస్తోందన్నారు . ఆర్డర్ లు పెరుగుతుండటంతో డెలివరీ కెపాసిటీని హ్యాండిల్ చేసేందుకు డెలివరీ, ఈకామ్ ఎక్స్‌‌ప్రెస్, ఎక్స్‌‌ప్రెస్‌‌బీస్ వంటి థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ ప్రొవైడర్లతో కలిసి పని చేస్తున్నట్టు స్నాప్‌‌డీల్ చెప్పింది. అమెజాన్ కూడా డిమాండ్‌‌ను అందుకోవడం కోసం 50 వేల సీజనల్ రోల్స్‌‌ను యాడ్ చేస్తున్నట్టు తెలిపింది.

పండగ సీజన్ ఆర్డర్ల కోసం
జూలై ముగింపు లేదా ఆగస్ట్ మొదటి నుంచి మొదలయ్యే ఫెస్టివ్ షాపింగ్ సీజన్.. డిసెంబర్ ముగిసే వరకు ఉంటుంది. ప్రతేడాది కూడా ఫెస్టివ్సీజన్‌‌లో వచ్చే డిమాండ్‌‌ను అందుకోవడానికి ఈకామర్స్ సంస్థలు, డెలివరీ బేస్డ్ ఆర్గనైజేషన్స్‌ తాత్కాలిక ఉద్యోగులను నియమించుకుంటాయి. ఈసారి కరోనా దెబ్బకు చాలామంది సిటీలు వదిలి తమ సొంత ఊర్లకు వెళ్లడంతో ఉద్యోగుల కొరత ఏర్పడింది. ప్రస్తుత కాలంలో కంపెనీల్లో చేరేవారికి జాయినింగ్ బోనస్‌‌లను కూడా కంపెనీలు ఇస్తున్నాయి.

For More News..

రూ.లక్ష కోట్లతో మారనున్న రైతు లైఫ్

ట్విట్టర్ చేతికి టిక్‌టాక్‌?

టిక్‌టాక్ ప్లేస్ లో వచ్చిన చింగారికి రూ.9 కోట్ల మనీ

Latest Updates