అప్ డేట్ గా ఉంటే…ఐటీ కొలువు పక్కా

ఐటీ జాబ్.. నేటితరం యువతీయువకుల ఫస్ట్ ఆప్షన్. ఈ రంగంలో స్థిరపడాలంటే టాలెంట్​తోపాటు రాణించగలిగేంత సెల్ఫ్​కాన్ఫిడెన్స్​ఉండాలి. మారుతున్న టెక్నాలజీని ఒడిసి పట్టే నేర్పు ఉండాలి. ఇవుంటే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనేది ఐటీ నిపుణులు అభిప్రాయం. రోజురోజుకు మార్పులు చోటుచేసుకునే రంగంలో ఎన్నో అనుబంధ కోర్సులు ఉన్నాయి. ఇప్పుడు కొన్ని హాట్ కేకుల్లా మారి ఐటీ ఆశావాహులకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాయి. ఐటీ అంటే అప్ డేట్​గా ఉంటూ మారుతున్న టెక్నాలజీపై అవగాహన కలిగి ఉండాలి. లేదంటే చేస్తున్న ఉద్యోగంలోకి కొత్త ఉద్యోగి తోసుకువచ్చేస్తారు. ఇలాంటి పరిస్థితిలో నిలదొక్కుకోవడానికి డిమాండ్ ఉన్న కోర్సులపై నిత్యం అధ్యయనం చేయాల్సిందే. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, మొబైల్ డెవలప్ మెంట్, డాటా విజువలైజేషన్, క్లౌడ్​ కంప్యూటింగ్, బ్లాక్ చెయిన్ వంటి అంశాలు నిరుద్యోగులను ఊరిస్తున్నాయి. ఈ సబ్జెక్టులలో బేసిక్ స్కిల్స్ సంపాదించుకున్నా ఫ్రెషర్​గా జాబ్​ రావడం పక్కా అనేది ఐటీ నిపుణుల సూచన.  అదేవిధంగా మొబైల్​డెవలప్పర్ గా రాణించాలంటే ఆండ్రాయిడ్, ఐఓఎస్ వంటి కోర్సుల్లో ప్రావీణ్యం సాధించగలిగితే ఆన్​సైట్​అవకాశాలు మెండుగా ఉన్నాయని చెబుతున్నారు. ప్రస్తుతం సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో హ్యాకింగ్ సర్వసాధారణమైంది. దీంతో బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఎమర్జింగ్ కెరీర్​గా నిలుస్తుంది. ఈ రంగంలో ఎక్కువ అవకాశాలు ఉండటంతో భారీ ప్యాకేజీలతో ఉద్యోగం దక్కించుకునే వీలుంది. ఆర్థికపరమైన అంశాలన్నీ డిజిటల్​గా జరిగిపోతున్నాయి. వీటిని మరింత సురక్షితంగా జరపాలంటే బ్లాక్ చెయిన్​ టెక్నాలజీ ఎంతగానో సహాయపడుతుందని, బేసిక్ స్కిల్స్ ఉన్నా, మంచి ఉద్యోగంలో స్థిరపడ వచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ లోనూ మంచి అవకాశాలు ఉన్నాయి. అన్ని రంగాల్లో ఈ టెక్నాలజీ వినియోగం విపరీతంగా పెరుగుతుండటమే కారణం. మెయిన్​గా మొబైల్​ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ను బాగా వినియోగిస్తున్నారు. బేసిక్, ఎవర్ గ్రీన్ కోర్సులైన జావా, ఒరాకిల్​వంటి టెక్నాలజీలోనూ ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయని, జావా డెవలప్పర్లకు ఒకప్పుడు ఉన్న డిమాండ్ కన్నా మరింత పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. కోడింగ్, టెస్టింగ్ తరహా ఉద్యోగాలతోపాటు జావాలో స్ప్రింగ్ బూట్, యాంగ్లర్ జేఎస్ వంటి అంశాల్లో ప్రావీణ్యం సాధించడం బెటర్ అంటున్నారు. బేసిక్ నాలెడ్జ్ తో ఫ్రెషర్​ గా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నా, టాలెంట్​కు తగినట్లుగా జీతం, మంచి ఉద్యోగంలో స్థిరపడే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

స్కిల్స్ తక్కువైనా ఫర్లేదు….

మెదడుతో చేసే పనులకు నోటితో పనేంటి అనే విషయాన్ని ఇటీవల కాలంలో ఐటీ రంగం బాగా అన్వయించుకుంది. ఇంటర్వ్యూలో మినిమం కమ్యూనికేషన్ స్కిల్స్ తో మేనేజ్​ చేయగలిగి, సబ్జెక్టుపై మంచి పట్టు ఉందంటే మంచి కంపెనీలు గబుక్కున లాగేసుకుంటున్నాయి. గతంలో మాదిరి కమ్యూనికేషన్ స్కిల్స్​తో కుస్తీ పట్టకుండా, సబ్జెక్టుపై అవగాహన, లోతైన అధ్యయనం ఉంటే ఉద్యోగాన్ని పట్టేయొచ్చని ఓ కంపెనీ హెచ్ఆర్​ మేనేజర్ తెలిపారు. అలాగే ఎడ్యుకేషన్ ఇయర్​ఎండింగ్​లో సంబంధిత కోర్సులపై అవగాహన పెంచుకోవాలని, బేసిక్ స్కిల్స్ తో క్యాంపస్ ప్లేస్​మెంట్స్​లో రాణించవచ్చంటున్నారు.

ఆన్ క్యాంపస్​ తగ్గినా…

రెండేళ్ల నుంచి ఐటీ కంపెనీలు ఆన్​క్యాంపస్​రిక్రూట్​మెంట్లను తగ్గించినా, ఆఫ్ క్యాంపస్​ ఉద్యోగాలు పుష్కలంగానే అందుబాటులో ఉన్నాయి.  నిరుద్యోగులు తాము చదువుకున్న కాలేజీలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ జరగలేదని బాధపడకుండా ఎంచక్కా సబ్జెక్టును నేర్చుకుంటే జాబ్ గ్యారంటీ అని, పలువురి రిక్రూటర్ల అభిప్రాయం. చేస్తున్న ప్లాట్ ఫాం కంటే మరొక దానిలోకి మారే వారు ఎక్కువగా ఉంటున్నారని, దీంతో బేసిక్ సబ్జెక్టుపై పట్టు ఉన్న వారికి ఉద్యోగం దొరకడం మరింత ఈజీ అని కన్సల్టెంట్లు స్పష్టం చేస్తున్నాయి.

Latest Updates