స్కూల్లోనే ఇరుక్కుపోయిన 350మంది విద్యార్థులు, టీచర్లు

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, భారీ వరదల కారణంగా ఓ పాఠశాలకు 350 మందికి పైగా విద్యార్థులు, 50 మంది ఉపాధ్యాయులు ఒక రోజంతా పాఠశాలలోనే ఇరుక్కుపోయారు. రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్ ‌ పాఠశాలకు చెందిన వారంతా శనివారం స్కూల్ కు వెళ్లారు. అయితే వర్షాల కారణంగా సమీపంలోని రానా ప్రతాప్ ఆనకట్ట నుండి భారీగా వరద నీరు విడుదలై ఆ నీరంతా రోడ్ల పైకి రావడంతో స్కూల్ పరిసరాలు నీటమునిగాయి. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు  అంతా పాఠశాలలోనే చిక్కుకుపోయారు. శనివారం నుండి పాఠశాలలోనే ఉండిపోయిన వారందరికీ..  స్థానికులు తక్షణ సహాయార్ధం ఆహారాన్ని అందిస్తున్నట్లు సమాచారం.

More than 350 students and 50 teachers have been stuck at a school in Chittorgarh in Rajasthan

Latest Updates