వీర జవాన్లకు కన్నీటి వీడ్కోలు

పుల్వామా ఉగ్ర దాడిలో వీరమరణం పొందిన జవాన్ల భౌతిక కాయాలకు వారి స్వస్థలాల్లో అంత్యక్రియలు కొనసాగుతున్నాయి. ఈ అంతిమ యాత్రకు పెద్ద సంఖ్యలో స్థానికులు హాజరై… జవాన్లకు జోహార్లు పలుకుతున్నారు. అమర్ రహే అంటూ కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు. అంతిమ యాత్రలో జాతీయ జెండాలు చేత పట్టుకుని వెళ్తున్నారు. రాజస్థాన్ లోని గోవింద్ పురాలో సీఆర్పీఎఫ్ జవాన్ రోహితాష్ లాంబా అంత్యక్రియలకు పెద్ద సంఖ్యలో జనం హాజరయ్యారు.

అమర జవాన్ రమేష్ యాదవ్ భౌతిక కాయాన్ని వారణాసి సమీపంలోని అతడి స్వగ్రామం తోఫాపూర్ కు తీసుకొచ్చారు. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో జనం తోఫాపూర్ కు తరలివచ్చారు. జాతీయ జెండాలు పట్టుకుని అంతిమయాత్రలో పాల్గొన్నారు. అమర్ రహే అంటూ నివాళులు అర్పించారు. రమేష్ యాదవ్ కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు.

Latest Updates