మార్టిగేజ్ లోన్లు లేటయితున్నయ్

మార్టిగేజ్ లోన్లు లేటయితున్నయ్

ఎల్​ఆర్​ఎస్​, బీఆర్​ఎస్​ లేకుంటే లోన్లు ఇస్తలేరు
గతంలో బ్యాంకర్ లేకుండానే మార్టిగేజ్
తాజాగా ధరణిలో ఓనర్​తో పాటు బ్యాంకర్ థంబ్ ​మస్ట్​
బ్యాంకర్లకు, కొనుగోలు దారులకు తప్పని తిప్పలు

సూర్యాపేట, వెలుగురాష్ట్ర ప్రభుత్వం ఎల్‌‌ఆర్‌‌ఎస్ పై వెనక్కితగ్గడంతో రియల్ ఎస్టేట్ ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా, ధరణి పోర్టల్​లో కొత్తగా తెచ్చిన ఆప్షన్​ మార్టిగేజ్​లోన్స్​కు సమస్యగా మారింది. గతంలో బ్యాంకులు ఇచ్చే మెమోరాండం ఆఫ్ టైటిల్ డీడ్ తీసుకెళ్తే ప్లాట్​ను​గానీ, ఇల్లును గానీ  మార్టిగేజ్ చేసేవారు. కానీ తాజాగా ధరణి పోర్టల్ లో  యజమాని తో పాటు బ్యాంక్ మేనేజర్  ఫింగర్ ప్రింట్ వేయాల్సి వస్తుండడంతో ఒక్కో మార్టిగేజ్​కు రిజిస్ట్రేషన్​ ఆఫీసులో రోజంతా పడుతోంది. దీంతో తాము వర్కింగ్​ అవర్స్​నష్టపోతున్నామని భావిస్తున్న బ్యాంకర్లు మార్టిగేజ్ లోన్లకు నిరాకరిస్తున్నారు. దీంతో  భూములు, ఇండ్లు కొనుగోలు చేయాలనుకున్న  వారికి నిరాశే ఎదురవుతోంది.

ధరణితో ఇబ్బందులు..

గతంలో సైట్​డాక్యుమెంట్స్​బ్యాంకుకు తీసుకెళ్తే.. చెక్​చేసి, లోన్​కు అన్ని విధాలా ఎలిజిబిలిటీ ఉందనుకున్నప్పడు బ్యాంకర్లు  మెమోరాండం ఆఫ్ టైటిల్ డీడ్ ఇష్యూ చేసేవారు. దానిని సబ్​రిజిస్ట్రార్​ ఆఫీసుకు తీసుకెళ్లి ప్రాపర్టీ వాల్యూలో 0.6శాతం టాక్స్​ చెల్లిస్తే బ్యాంక్​ పేరు మీద మార్టిగేజ్​ చేసేవారు. ఈసీలో బ్యాంక్​పేరు నమోదయ్యాక ఆ డాక్యుమెంట్స్​ను బ్యాంకులో సబ్మిట్​ చేస్తే మేనేజర్లు లోన్​ సాంక్షన్ చేసేవారు. లోన్ పీరియడ్ పూర్తయ్యాకే ప్రాపర్టీ ఓనర్​కు ట్రాన్స్​ఫర్​ చేసేవారు. ఏ దశలోనూ బ్యాంకర్లు, రిజిస్ట్రేషన్ఆఫీసుకు వచ్చేవారు కాదు. కానీ కొత్తగా తెచ్చిన ధరణి పోర్టల్ నిబంధనల ప్రకారం ప్రాపర్టీ మార్ట్​గేజ్​ కోసం కొనుగోలుదారుడితో పాటు  బ్యాంకర్లు కూడా రావాల్సి వస్తోంది. సర్వర్ ప్రాబ్లమ్ కారణగా ఒక్కో రిజిస్ట్రేషన్ కు రోజంతా పడుతోందని, తమ వర్క్​టైం మొత్తం పోతోందని బ్యాంకర్లు అంటున్నారు.  దీంతో  మార్టిగేజ్​లోన్స్​పై ఇంట్రెస్ట్​ చూపక అప్లికేషన్లన్నీ పెండింగ్​పడుతున్నాయి.

ఎల్​ఆర్​ఎస్​, బీఆర్​ఎస్​ ఉండాల్సిందే..

ఎల్‌‌ఆర్‌‌ఎస్ లేకున్నా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నప్పటికీ ఎల్​ఆర్​ఎస్​, బీ‌‌ఆర్‌‌ఎస్  లేకపోతే మాత్రం బ్యాంకులు లోన్లు ఇస్తలేవు. దీంతో స్టేట్​వైడ్​ మార్టిగేజ్​లోన్స్​కోసం పెట్టుకున్న వేలాది అప్లికేషన్లు పెండింగ్​లో పడ్డాయి. ఉదాహరణకు ఒక్క సూర్యాపేట జిల్లాలో సుమారు 460కి పైగా లోన్​ అప్లికేషన్లు బ్యాంకర్ల వద్ద పేరుకపోయాయి. దీంతో ప్రభుత్వ తీరుపై సామాన్యులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏం చేయాలో తెలియని పలువురు బయట మిత్తికి తెచ్చి భూములు, ఇండ్లు కొంటున్నారు. కరోనా ఎఫెక్ట్​, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 2020 – 21 ఫైనాన్షియల్ ఇయర్ లో రూ. 107.36కోట్ల హౌసింగ్​లోన్స్​ టార్గెట్ కు గాను సూర్యాపేట జిల్లాలో ఇప్పటి వరకు కేవలం రూ. 52.16 కోట్లు మాత్రమే సాంక్షన్​ చేశారు.

లోన్ ఇవ్వట్లేదు.

ఇల్లు  కొందామని బ్యాంక్ లో లోన్ కోసం అప్లికేషన్​ పెట్టుకున్నాను. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ లోన్​ సాంక్షన్​ చేస్తలేరు. మార్టిగేజ్ చేసే టైంలో లేట్ అవుతుందని బ్యాంకర్లు సాకు చెప్తున్నారు. ఏం చేయాలో తెలియక బయట వడ్డీకి అప్పు తెచ్చుకొని ఇల్లు కొనుక్కున్నాం.

–రవి, సూర్యాపేట

ఇబ్బందులు పడుతున్నం

మార్టిగేజ్​ కోసం ప్రాపర్టీ కొనుగోలుదారులతో పాటు బ్యాంకర్లు రిజిస్ట్రేషన్​కు ఆఫీసుకు వచ్చి  థంబ్ వేయాలనే నిబంధన కష్టంగా ఉంది. సర్వర్​ ప్రాబ్లమ్​తో రోజంతా రిజిస్ట్రేషన్​ ఆఫీసులోనే గడుస్తోంది. ఒక పక్క కేంద్ర ప్రభుత్వ ఆత్మ నిర్భర్ భారత్ కింద లోన్లు మంజూరు చేయాల్సి ఉంది. ఈ టైంలో బ్యాంక్ ను వదిలి రిజిస్ట్రేషన్​ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి రావడం బాధాకరం. బ్యాంకుల్లో పనులన్నీ పెండింగ్​ పడుతున్నాయి.

–రమేశ్​, బ్యాంక్ మేనేజర్, సూర్యాపేట