చింపాంజీ పిల్ల దర్జా చూసారా!

‘రాజా రాజాధి రాజాధి రాజా..’ పాట గుర్తుందా! ఎప్పుడైనా, ఎట్లున్నా, ఏమున్నా లేకున్నా నేనే రాజా అంటూ హీరో చిందేస్తాడు. ఈ పిల్ల చింపాంజీ పోజు కూడా అలాగే లేదు. ఎంచక్కా తల్లికి వీపునాన్చి చేతుల మీద తలపెట్టుకుని దర్జాగా రెస్ట్​ తీసుకుంటున్న దీని హొయలు అలాగే ఉన్నాయి మరి. కోనల్నే కోటగా మలిచేసుకుని రాజాలా ఉంటానన్న ధీమా దాని కళ్లల్లో కనిపిస్తోంది కదా. కామెడీ వైల్డ్​లైఫ్​ ఫొటోగ్రఫీ అవార్డ్స్​కు ఎంపికైంది ఈ ఫొటో. పోటీల కోసం 40 ఫొటోలను ఎంపిక చేశారు. టాంజానియాకు చెందిన వైల్డ్​లైఫ్​ ఫొటోగ్రాఫర్లు టామ్​ సల్లామ్​, పాల్​ జాయ్​న్సన్​ హిక్స్​ కలిసి ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. వైల్డ్​లైఫ్​లోని సరదా సంగతులను చూపించడం ఒక్కటే ఈ పోటీల ఉద్దేశం కాదు. అందమైన ఆ అడవి జంతువులను కాపాడుకోవడమూ చాలా ముఖ్యమన్న ఉద్దేశమూ ఆ పోటీల్లో ఉంది. బార్న్​ ఫ్రీ ఫౌండేషన్​తో కలిసి వాళ్లిద్దరూ ఈ పోటీలు నిర్వహిస్తున్నారు.

Latest Updates