శ్రీముఖికి ‘మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఆన్ టీవీ’ అవార్డు

క్యూట్‌గా, చబ్బీగా ఉండి.. తన యాంకరింగ్‌తో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ప్రతి ఇంట్లో తనకంటూ ఒక అభిమానిని సంపాదించుకుంది. తెలుగు టీవీ ప్రేక్షకులకు రాములమ్మగా పరిచయం అక్కర్లేని పేరు. తన చలాకీతనంతో ఇన్‌స్టాగ్రాంలో 2.5 మిలయన్లకు పైగా ఫాలోవర్లను సంపాదించుకుంది. స్టూడెంట్లందరూ ఆమెని అక్కా అక్కా అని పిలుస్తుంటారు. ఈ పాటికే ఆమె ఎవరో అర్థమైపోయుంటది. అవును.. ఆమె.. మీరనుకుంటున్నది నిజమే.

యాంకర్ శ్రీముఖి.. తన మాటల గారడీతో ప్రేక్షకులను టీవీకి అతుక్కుపోయేలా చేస్తుంది. పటాస్ షోతో విద్యార్థులలో ఎనలేని క్రేజ్‌ని సొంతం చేసుకున్నది. తెలుగు ‘బిగ్‌బాస్ సీజన్3’లో రన్నర్ అప్‌గా నిలిచి.. తన సత్తా ఏంటో నిరూపించుకుంది. అప్పుడప్పుడు సినిమాలలో విభిన్న పాత్రలు చేస్తూ వెండితెరపై కూడా ప్రేక్షకులను మెప్పిస్తుంది.

తాజాగా.. శ్రీముఖి ‘మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఆన్ టీవీ’ అవార్డును గెలుచుకుంది. హైదరాబాద్ టైమ్స్ ప్రతి సంవత్సరం ఈ అవార్డు కోసం ఓటింగ్ పోల్‌ని నిర్వహిస్తుంది. ఆ పోల్‌లో శ్రీముఖి నంబర్ వన్‌గా నిలిచింది. ఎంతోమంది సీనియర్ యాంకర్లను కాదని ప్రేక్షకలు శ్రీముఖికి ఓటు వేసి పట్టం కట్టారు. గత సంవత్సరం హైదరాబాద్ టైమ్స్ పోల్‌లో నెంబర్ 11గా ఉన్న శ్రీముఖి.. ఈ సంవత్పరం నెంబర్ 1 స్థాయికి ఎగబాకింది.

For More News..

తల్లిదండ్రుల్ని, తమ్మున్ని చంపిన మైనర్ బాలుడు

సమ్మెలో బ్యాంకు ఉద్యోగులు: మూడు రోజులు కస్టమర్లపై ఎఫెక్ట్

వీడియో: భారత్, న్యూజిలాండ్ మూడో T20లో విచిత్ర సంఘటన

కొన్నది 25 వేలకి.. అమ్మితే వచ్చేది 5 కోట్లు

ఈ అవార్డు గెలుచుకోవడంపై శ్రీముఖి తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. ‘నాకు ఈ అవార్డు వచ్చిందంటే నేను అసలు నమ్మలేదు. నన్ను ఈ అవార్డుకు నామినేట్ చేసిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. నేను ఈ అవార్డు గెలుచుకోవడానికి ‘బిగ్‌బాస్ సీజన్3’ చాలా బాగా ఉపయోగపడింది. ఆ షోలో ప్రేక్షకులు నన్ను నన్నుగా చూశారు. నేను బయటి ప్రపంచంలో ఎలా ఉంటాను, ఎలా తింటాను, ఎలా వండుతాను, మరియు ఎలా ఫైట్ చేస్తాను అనే విషయాలు ప్రేక్షకులు చూశారు. అవే నాకు ఈ అవార్డు రావడానికి ఉపయోగపడ్డాయి’ అని ఆమె అన్నారు.

చాలా మంది మిమ్మల్ని క్యూట్, ట్రెడిషినల్ గర్ల్ అంటుంటారు కదా మరి మిమ్మల్ని సెక్సీ అని ఎప్పుడు పిలిపించుకుంటారు అని అడిగితే.. ‘మీరు నాకు ఒక చిన్న స్కర్ట్ ఇచ్చి వేసుకోమన్నా కూడా వేసుకుంటాను. కానీ, నా అభిమానులు, కాలేజీ విద్యార్థులు నన్ను ఎక్కువగా చూడీదార్, లంగా ఓణిలో మాత్రమే ఇష్టపడతారు. అంతేందుకు విద్యా బాలన్ ఎక్కువగా చీరలలోనే కనిపిస్తారు. మరి ఆమె మోస్ట్ సెక్నీయస్ట్ ఉమెన్ ఇన్ ఇండస్ట్రీ కాలేదా’ అన్నారు.

తనకు సౌందర్య, విద్యా బాలన్, సావిత్రిలు ఎంతో స్పూర్తిదాయకమని ఆమె అన్నారు. హైపర్ యాక్టివ్‌గా ఉండే వాళ్లంటేనే తనకిష్టమని తెలిపింది. తనకు రణ్‌వీర్ సింగ్‌లా ఉండేవాళ్లు నచ్చుతారని ఆమె అన్నారు. ఎప్పటికైనా తనను తాను జీరో సైజులో చూసుకోవాలనే కోరిక ఉన్నట్లు ఆమె తెలిపారు.

హైదరాబాద్ టైమ్స్ నిర్వహించిన ఈ పోల్‌లో టాప్ 15 మందిని ఎంపిక చేశారు. శ్రీముఖి మొదటి ప్లేస్‌లో ఉండగా.. ప్రో కబడ్డీ లీగ్‌కు తెలుగులో వ్యాఖ్యాతగా వ్యవహరించిన వింద్య విశాఖ రెండో స్థానంలో ఉంది. ఇక ఈ మధ్యే బుల్లి తెరపై కనిపిస్తున్న వర్షిణి నాలుగోస్థానంలో నిలిచింది. యాంకర్ రష్మి మాత్రం అయిదో స్థానంలో ఉంది.  ఆ తర్వాత ఆరో స్థానాన్ని విష్ణుప్రియ సొంతం చేసుకుంది. ఇక అనసూయ అయితే ఏకంగా 14వ స్థానంలో ఉంది.

Latest Updates