ఈసారి ఎండలు మామూలుగా ఉండవట

ఈసారి ఎండలు మామూలుగా ఉండవట

న్యూఢిల్లీ: ఈ ఏడాది ఎండలు మండిపోనున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. దేశంలోని చాలా చోట్ల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ హెచ్చరించింది. ఏప్రిల్ నుంచి జూన్ నెలల్లో తూర్పు, మధ్య, ఈశాన్య భారత్ లోని ఎక్కువ ప్రాంతాల్లో వేడి గాలులు వీస్తాయని పేర్కొంది. గత కొన్ని సంవత్సరాలతో పోలిస్తే ఇలాంటి పరిస్థితి ఈసారి ముందే రావడం గమనార్హం. పదేళ్ల కాలాన్ని చూసుకుంటే వేడి గాలులు ఏప్రిల్ నెలలో వచ్చేవి. ముఖ్యంగా మే నెలలో వీటి ప్రభావం మొదలవుతుంది. కానీ ఈ ఏడాది మార్చ్ లోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వర్షాలు తక్కువగా పడటం, పొడి గాలుల వల్ల ఈ స్థితి ఏర్పడిందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.