రబ్ నే బనాదీ.. రోమాంటిక్ జోడీ

‘‘ఏమే పెండ్లామా. ఎన్నిరోజులైందే మనమిట్ల కలిసి డ్యాన్స్‌‌‌‌ చేసి. నీ చెయ్యిల చెయ్యేసి సల్సా డ్యాన్స్‌‌‌‌ చేస్తే..  ఆ ఫీలింగే వేరుంటదే. ‘షాదీ జేసుకుంటె మస్తుమస్తుగుంటది. పెండ్లామొచ్చినాక జబర్దస్తుగుంటది’ అని ఎవరన్నరో గాని అది వంద శాతం నిజమే. అసలు నువ్‌‌‌‌ నా పెండ్లామవుడు నా అదృష్టమహె’’

అని భార్య చిట్టెలుకతో భర్త ఎలుక రొమాంటిక్‌‌‌‌గా మాట్లాడుతోందని ఫొటో చూసి అనుకుంటున్నరేమో. అస్సలు కాదు.‘నీ సంగతి సూస్తరా’ అని రెండూ గల్ల వట్టుకొని కొట్లాడుకుంటున్నయ్‌‌‌‌. లండన్‌‌‌‌లోని ఓ అండర్‌‌‌‌ గ్రౌండ్ పాస్‌‌‌‌లో ఎవరో ఏదో తింటుండగా ఓ ముక్క కిందవడ్డది. అంతే.. సర్రున ఉరికొచ్చినయ్‌‌‌‌ రెండు ఎలుకలు. ముక్క కోసం జుట్టుజుట్టు వట్టుకున్నయ్‌‌‌‌. ఆ టైంలో ఫొటోగ్రాఫర్‌‌‌‌ సామ్‌‌‌‌ రౌలీ అక్కడే ఉన్నడు. ఠక్కున ఫొటో దించిండు. ఇదే ఫొటో ఇప్పుడు వైల్డ్‌‌‌‌ లైఫ్‌‌‌‌ ఫొటోగ్రాఫర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద ఇయర్‌‌‌‌ 2019 పోటీలో షార్ట్‌‌‌‌లిస్టయింది.

Latest Updates