ఒక దొంగ.. 255 చోరీలు.. 209 శిక్షలు

most-wanted-robber-arrested-by-north-jone-police
  • స్క్రూ డ్రైవర్ ఆయుధంగా 40 ఏండ్లుగా దొంగతనాలు
  • పోలీసుల రికార్డుల్లో మోస్ట్ వాంటెడ్
  • ఎట్టకేలకు చిక్కిన మంత్రి శంకర్

హైదరాబాద్,వెలుగు: చోరీలు చేయడంలో 40 ఏళ్ల అనుభవం. పోలీసులు, కేసులు, జైళ్లంటే భయం లేదు. స్క్రూ డ్రైవరే అతని ఆయుధం. ఇంటికి తాళం ఉంటే చాలు.. కన్నం వేసి క్షణాల్లో పైసల్ మాయం చేస్తడు. అతనే మంత్రి శంకర్ అలియాస్ శివన్న, శివప్రసాద్(58). హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో 255కి  పైగా కేసులున్న ఈ ఘరాన దొంగ.. మరోసారి పోలీసులకు చిక్కాడు. రికార్డుల్లో మోస్ట్ వాంటెడ్​గా ఉన్న శంకర్ తో పాటు రౌడీ షీటర్ కె దినకరన్ ను కార్ఖానా పోలీసులు మంగళవారం అరెస్టు చేసి కటకటాల్లోకి పంపారు. వీళ్ల నుంచి 100 గ్రాముల బంగారు నగలు, స్కూటీ, ఆటో, ఐరన్ రాడ్, స్క్రూ డ్రైవర్, టార్చి లైటు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించామని నార్త్ జోన్ డీసీపీ కల్మేశ్వర్ వెల్లడించారు.

చోరీల్లో రెండున్నర సెంచరీలు

మంత్రి శంకర్(58) పై 255 కి పైగా చోరీ కేసులు ఉన్నాయి. ఇళ్ళలో చోరీలు చేయడంలో మంచి పట్టున్న శంకర్ రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్లలో నమోదైన 11 కేసుల్లో మూడు సార్లు పీడీ యాక్ట్ పై జైలుకు వెళ్లాడు. చిలకలగూడకు చెందిన శంకర్ 1979 నుంచి మొత్తం 250 చోరీలు చేశాడు. ఇందులో 209 కేసుల్లో జైలు శిక్షలు అనుభవించాడు. బన్సీలాల్ పేట్ కి చెందిన రౌడీ షీటర్ కె.దినకరన్ (20)తో కలిసి చోరీలకు స్కెచ్ వేశాడు. కిందటేడాది అరెస్టైన శంకర్ 18 నెలల పాటు చర్లపల్లి జైల్లో శిక్ష అనుభవించి పోయిన నెల 19 న బయటికి వచ్చాడు. మళ్లీ అదే బాటలో కార్ఖానా, తుకారాంగేట్, నేరేడ్ మెట్, కుషాయిగూడ పీఎస్ ల పరిధిలో వరుస చోరీలకు పాల్పడ్డాడు. వరుస చోరీలతో జనాల్ని హడలెత్తిస్తున్న శంకర్ కదలికలపై నార్త్ జోన్ పోలీసులు నిఘా పెట్టారు. కార్ఖానా ఇన్ స్పెక్టర్ మధుకర్ స్వామి ఆధ్వర్యంలో డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ నేతాజీ టీం.. శంకర్ మూవ్ మెంట్స్ ఫోకస్ పెట్టింది. మరో చోరీకి స్కెచ్ వేశాడని తెలుసుకుని పక్కా ప్లాన్ తో శంకర్ తో పాటు దినకర్ ను మంగళవారం అరెస్టు చేసింది.

most wanted robber Arrested by north jone police

Latest Updates