బావిలో దూకి తల్లి కూతుళ్ల ఆత్మహత్య

తాడ్వాయి , వెలుగు: కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని ఎర్రపహాడ్ గ్రామంలో బావిలో పడి తల్లి కూతుళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. ఎర్ర పహాడ్ గ్రామానికి చెందిన బద్దం లక్ష్మారెడ్డి కొత్త ఇల్లు కట్టుకోవడానికి ఆరు లక్షల వరకు అప్పు చేశారు. దీనికి తోడు అతని కొడుకు రణదీప్ రెడ్డి పనిపాట లేకుండా తిరుగుతున్నాడు. ఈవిషయంతో లక్ష్మారెడ్డికి, అతని భార్య లింగమణికి మధ్య గొడవలు జరుగుతున్నాయి.

సోమవారం కూడా ఈ విషయాల మీదే ఇద్దరు కొట్లాడుకోగా లింగమణిని భర్త మందలించాడు. దీంతో లింగమణి (42), కూతురు శిరీష (20)తో కలిసి బావిలో దూకి ఆత్మ హత్య చేసుకుందని సదాశివనగర్ సిఐ వెంకట్, తాడ్వా యి ఎస్ఐ కృష్ణ మూర్తి తెలిపారు. కొడుకు రణదీప్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఒక్క మర్డర్ దాచడం కోసం 9 హత్యలు చేశాడు

V6 ఛానెల్ చొరవతో బెంగళూరు నుండి స్వ‌గ్రామానికి త‌ల్లీకూతుళ్లు 

నెటిజన్లు ఫిదా : బర్రె పగ తీర్చుకుంది.. ఆకతాయిల నడుం ఇరకొట్టింది

Latest Updates